ఇంట్లోనే ఫేషియల్!


Fri,November 30, 2018 11:23 PM

చాలామంది మహిళలు ఫేషియల్ కోసమే బ్యూటీ పార్లల్‌కి వెళ్తుంటారు. మరి పార్లల్‌కి వెళ్లలేని వారు ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవచ్చని తెలుసా?

skincare
-ముందుగా శనగపిండితో ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఆ తరువాత దూదిని ఫ్రిడ్జ్‌లోని ఐస్‌వాటర్‌లో ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి.
-వేడినీటిలో పసుపు, వేపాకులు వేసి ఆవిరి పెట్టుకోవాలి. ఆ నీటిలోనే పెరుగు, పాలు కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల పాటు కీరా ముక్కలను కళ్లపై పెట్టుకోవాలి. తరువాత ముఖాన్ని నీటితో కడుగాలి.
-ఆలూపేస్ట్‌లో కొంచెం నిమ్మరసం, ఓట్‌మీల్‌పొడి, పాలు కలిపి ముఖానికి రాయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే కాంతివంతమవుతుంది.
-దోసకాయ రసంతో ముఖాన్ని ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడుగాలి.
-బాదంపొడి, ఓట్‌మీల్ పొడి, పాలు కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుగాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది.

786
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles