ఇంటికి అందాన్నిచ్చే పాత వస్తువులు!


Sat,December 15, 2018 12:31 AM

ఇంట్లో వాడుకొనే పింగాని కప్పులు, ప్లాస్టిక్ డబ్బాలు పగిలితే పడేస్తుంటాం. పగిలిపోయిన వాటిని కొన్ని మార్పులు చేస్తే కొత్త వాటిలా ఇంటికే అందాన్ని తెచ్చిపెడుతాయి.
homeFla
-సోఫాలు, మంచాలు వాడకుండా ఉంటే వాటిమీద పలుచటి ప్లాస్టిక్ షీట్స్ వేయాలి. దుమ్ము, ధూళీ ఏదైనా ఉంటే ఆ షీట్ మీదనే పడుతుంది. మంచం కావాలంటే షీట్ తీసేయవచ్చు. సోఫా మీద అలాగే ఉన్నా అందంగా ఉంటుంది.
-ఖరీదైన ప్లాస్టిక్ పూలు, పూల కుండీలు కొనడం ఆపండి. చిన్న చిన్న మట్టి కుండీలు తీసుకొని నచ్చినట్టుగా పెయింట్ వేసి, ఇంటిలోపల పెంచుకునే మొక్కలను నాటాలి. ఈ కుండీలను గదుల మూలల్లో పెట్టుకుంటే ఇంటి అందాన్ని పెంచుతాయి.
-ప్రతీ రూమ్‌లో ఒక చెత్త బుట్ట పెట్టుకోవడం మంచిది. చెత్త, చెదారం, కాగితం ముక్కలు ఎక్కడపడితే అక్కడ పడేయకుండా చెత్త బుట్టలో వేసేలా అలవాటు చేసుకోవాలి. చెత్త బుట్టలకి పెయింటింగ్ వేసుకుంటే ఖరీదైన వస్తువుగా కనబడుతాయి.
-పగిలిన పింగాని కప్పులు, ప్లాస్టిక్ డబ్బాలను పారేయకుండా పగుళ్ల చోట పెయింట్ వేసి వాటిని మట్టితో నింపాలి. ఇందులో చిన్న చిన్న మొక్కలు నాటుకుంటే వాటి అందం ముందు ఖరీదైన ఫ్లవర్‌వాజులు కూడా పనికిరావు.
-ప్రతీ ద్వారానికి కర్టెన్ ఉండేలా చూసుకోండి. లేత రంగులో ఉండి ట్రాన్సపరెంట్‌గా ఉంటే ఇంటికి మరింత అందం వస్తుంది.

554
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles