ఇంటర్నేషనల్ రేసింగ్‌కు రెఢీ!


Mon,September 10, 2018 01:28 AM

మన మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇన్నాళ్లూ క్లిష్టంగా భావించే రేసింగ్ పోటీల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం పెరుగుతున్నది. ఇందుకు నిదర్శనం జేకే టైర్ ఇంటర్నేషనల్ రేసింగ్ పోటీలే. వీటికి జాతీయస్థాయిలో నిర్వహించిన సెలెక్షన్‌లో 60 మంది మహిళలు పాల్గొంటే.. ఈ ఆరుగురు మహిళలు తమ సత్తాచూపి అంతర్జాతీయ రేసింగ్‌కు ఎంపికయ్యారు.
Women-Racing-Team
కార్ రేసింగ్ అంటే మామూలు విషయం కాదు.. సెకన్లలో రయ్‌మంటూ దూసుకెళ్తాయి కార్లు. అంత వేగంలో ఒక్కోసారి ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా పోతాయి. అంతటి ప్రమాదకర రేసింగ్ పోటీల్లో ఇన్నాళ్లూ మగవారిదే ఆధిపత్యం. ఇప్పుడు రేసింగ్ ట్రెండ్ కూడా మారింది. మహిళలు కూడా రేసింగ్ పోటీలకు సై అంటున్నారు. జేకే టైర్ నేషనల్ పోటీల్లో 60 మంది మహిళలు పాల్గొంటే.. వీరిలో ఈ ఆరుగురు మహిళలు తమ ప్రతిభతో ఇంటర్నేషనల్ రేసింగ్‌లో పాల్గొంటున్నారు. నాలుగు విభాగాల్లో జరుగుతున్న ఈ పోటీల్లో మొదటిసారి మహిళా రేసర్లు పాల్గొంటున్నారు. వీరిలో ప్రొఫెషనల్ రేసర్ ప్రియంవద, మరాఠీ నటి మనిషా ఖేల్కర్, లీ డారెన్, రోషిణి, మేఘ, 16యేండ్ల హన్సుజా ఉన్నారు. కోయంబత్తూర్ వేదికగా పోటీల్లో పాల్గొంటూ పురుషులతో సమానంగా దూసుకెళ్తున్నారు. వీరిలో 16యేండ్ల హన్సుజా 11వ తరగతి చవుతున్నది. సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటన ఆధారంగా తల్లితో కలిసి పోటీలకు దరఖాస్తు చేసింది. ఇందులో విషయం ఏంటంటే కారు నడుపడం నేర్చుకున్న వారం రోజులకే పోటీల్లో పాల్గొని ఎంపికవడం. బెంగళూర్‌కు చెందిన హన్సుజా కర్ణాటక నేషనల్ జూనియర్ ఫుట్‌బాల్ టీంలో సభ్యురాలు. అతి పిన్న వయస్కురాలైన రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నది. నాలుగు రౌండ్లలో జరిగే ఈ పోటీలు నవంబర్‌లో ముగుస్తాయి.

463
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles