ఇంటర్నెట్ సూపర్‌స్టార్!


Sun,December 9, 2018 12:40 AM

అరుదైన వ్యాధి హచిసన్-గిల్ఫోర్డ్ ప్రోజెరియా సిండ్రోమ్. వీరిని చూడడానికే భయపడుతుంటారు. అలాంటిది ఈ పాప ఇంటర్నెట్ సూపర్‌స్టార్ అంటే నమ్ముతారా? ఫేస్‌బుక్‌లో 140 లక్షల ఫాలోవర్స్, యూట్యూబ్‌లో 17 కోట్ల వ్యూవర్స్ ఉన్నారంటే నమ్మాల్సిందే కదా.
adalia
టెక్సస్‌లోని ఆస్టిన్ నగరానికి చెందిన అడాలియాకి 11 యేండ్లు. పుట్టుకతోనే అరుదైన వ్యాధి వచ్చింది. అంగవైకల్యంతో పుడితేనే రోడ్డుమీద పదిలేస్తున్న ఈ రోజుల్లో అడాలియా తల్లిదండ్రులు తనని కంటికి రెప్పలా చూసుకున్నారు. వింతగా కనిపించే ముఖం, తలమీద ఒక్క వెంట్రుక కూడా లేదు. శరీరం ఎముకల గూడే! ఇవే ఈ వ్యాధి లక్షణాలు. అడాలియా తల్లిపేరు నటాలియా పల్లంటే. నటాలియాకి అడాలియా అంటే ప్రాణం. అమ్మాయిని అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తుంటుంది. అడాలియాకి ఫొటోలు, వీడియోలంటే చాలా ఇష్టం. అందుకే ఆ తల్లి పాప కోసం ఒక ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసింది. ఇక తండ్రి విగ్, లిప్‌స్టిక్, ఐలైనర్ ఏం కావాలన్నా తెచ్చి పెడుతుంటాడు. అడాలియా ప్రతిరోజూ రకరకాల గెటప్‌లతో వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు అడాలియాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అభిమానులు పెట్టే కామెంట్స్ వల్ల అడాలియాకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. యూట్యూబ్‌లో కూడా తన స్టిల్స్, వీడియోలు తీసి అప్‌లోడ్ చేస్తుంటుంది. ఫేస్‌బుక్‌లో 140 లక్షల ఫాలోవర్స్, యూట్యూబ్‌లో 17 కోట్ల వ్యూవర్స్ ఉన్నారు. ఇలా వచ్చిన పాపులారిటీ వల్ల అడాలియా ఎక్కడి కెళ్లినా అందరూ గుర్తుపట్టి పలుకరిస్తుంటారు. ఈ వ్యాధి ఉన్నందుకు తను ఏనాడూ బాధపడలేదు. అడాలియాని చూసి మేం చాలా నేర్చుకుంటున్నాం అని తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అడాలియా రోస్‌ని ఫాలో అయిపోండి.

231
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles