ఆ-ల-మైసన్ ఆనందాల హరివిల్లు


Sat,August 25, 2018 12:55 AM

house
ఉత్తర తెలంగాణకు ముఖద్వారం అయిన కొంపల్లిలో 65 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఆ-ల-మైసన్ ప్రాజెక్టును ఆరంభించామని.. ప్రస్తుతం 220 విల్లాలను నిర్మిస్తున్నామని.. వచ్చే నెల నుంచి కొనుగోలుదారులకు అందజేయడం ప్రారంభిస్తామని అశోకా బిల్డర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జైదీప్ రెడ్డి వెల్లడించారు. నమస్తే తెలంగాణ ప్రాపర్టీ షో సందర్భంగా నమస్తే సంపదకు ప్రత్యేక ఇంటర్వ్యూనిచ్చారు. సారాంశం ఆయన మాటల్లోనే..
Jaideep
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిర్మాణ రంగానికి గిరాకీ పెరిగింది. ప్రధానంగా అన్నిరకాల విల్లాలకు ఆదరణ అధికమైంది. మేం ముందునుంచీ కొనుగోలుదారుల అభిరుచి మేరకే నిర్మాణాల్ని చేపడతాం. దాదాపు కోటి రూపాయల కంటే ఎక్కువ పెట్టి తమ కలల గృహాన్ని కొనుగోలు చేసేటప్పుడు.. కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా వచ్చి నిర్ణయం తీసుకుంటారు. లొకేషన్, వాస్తు, ఎలివేషన్స్, విల్లా సైజు, ప్రాజెక్టులో మౌలిక సదుపాయాలు.. ఇలా ప్రతి అంశాన్ని పక్కగా గమనించాకే తుది నిర్ణయానికొస్తారు. అందుకే, వారికి అనిరకాలుగా నప్పే ఇంటిని అందించడానికి మేం ప్రత్యేకంగా కృషి చేస్తాం. బయ్యర్లకు తమకు నచ్చిన విల్లాను ఎంచుకోవడానికి దాదాపు ఎనిమిది విల్లా ఆప్షన్లు ఇచ్చాం. కస్టమైజేషన్‌కు అవకాశమిస్తున్నాం. ఎందుకంటే, అల్టిమేట్‌గా వారు ఆనందంగా నివసించడమే మాక్కావాలి. 250 నుంచి 600 గజాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసే విల్లాలు తూర్పు, పశ్చిమ ఫేసింగ్‌లోనే ఉంటాయి. ఒక్కో విల్లా ఆరంభ ధర.. కోటిన్నర కాగా గరిష్ఠ ధర.. రూ.3 కోట్లు.

-మా వద్ద విల్లాలు కొన్నవారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు. ఇదే మా అభిమతం. అందుకే, వచ్చే నెల నుంచి బయ్యర్లకు విడతలవారీగా విల్లాల్ని అందజేస్తాం. మొత్తానికి నాలుగు విడతల్లో, అంటే వచ్చే ఏప్రిల్ నాటికి విల్లాలన్నీ అందజేయాలన్నదే ప్రధాన లక్ష్యం. వచ్చే విద్యా సంవత్సరంలో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లను పంపించాలన్న ఉద్దేశ్యంతో పనులను త్వరగా పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే ఆ-ల-మైసన్ ప్రాజెక్టులో మంజీరా నీళ్లు వచ్చేశాయి. విద్యుత్ సౌకర్యాన్ని పొందుపరిచాం. ఇలా, మౌలిక సదుపాయాల్ని సిద్ధం చేశాం. నిర్మాణమంతా చివరి దశలో ఉండటం వల్లే.. కొనుగోలుదారులు మా విల్లాల్ని కొనడానికి ముందుకొస్తున్నారు.

-మా ప్రాజెక్టుల్లో ఎక్కడ ఇల్లు కొన్నా ఆనందంగా ఉండాలి. సంతోషంగా జీవనాన్ని కొనసాగించాలి. అందుకే, ఆ-ల-మైసన్‌లో సుమారు మూడు ఎకరాల్లో ప్రత్యేకంగా సెంట్రల్ పార్కును డెవలప్ చేస్తున్నాం. ఇందులో అన్ని రకాల ఆటలు ఆడుకోవచ్చు. చిన్నారుల నుంచి పెద్దల వరకూ ప్రతిఒక్కరూ తమకు నచ్చిన క్రీడను ఇందులో ఆస్వాదించవచ్చు. సాయంత్రం అయితే పార్కు కోలాహలంగా కనిపిస్తుంది. పైగా, ప్రాజెక్టు వెనకవైపు గ్రీన్ బెల్ట్ ఏరియా ఉండటంతో స్వచ్ఛమైన గాలీ ప్రసరిస్తుంది. 500 ఎకరాల్లో ఫారెస్ట్ అకాడమీ వల్ల.. భవిష్యత్తులోనూ పచ్చదనానికి ఎలాంటి ఢోకా ఉండదు. ప్రస్తుతం పశ్చిమలో ఇండ్ల సంఖ్య పెరిగిపోయింది. తూర్పు హైదరాబాద్‌తో పాటు ఉత్తర నగరానికీ పూర్తి స్థాయిలో ఆదరణ ఉంటుందని కచ్చితంగా చెబుతున్నాను.

430
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles