ఆ నలుగురు..


Tue,July 18, 2017 12:31 AM

నలుగురు మాతృమూర్తులు ఒక్కటయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉండి.. చికిత్సల్లో తల్లిదండ్రుల భావోద్వేగాలతో ఆడుకుంటూ.. దోపిడీకి పాల్పడుతున్న వైద్యరంగంపై పోరాడుతున్నారు.
girls
2015లో కొచ్చిలో ఐదేళ్ల మూగ చిన్నారిపై ఓ థెరపీ కేంద్రంలో లైంగిక దాడి జరిగింది. అదే ఏడాది మార్చిలో థెరపీ పేరుతో ఆరేళ్ల మూగ బాలుడి చేయి విరగ్గొట్టారు. థెరపీ కేంద్రాలకు వచ్చే యువతులతో అసభ్యంగా ప్రవర్తించడం, చిన్నారులను వేధించడం వంటి దురాఘతాలపై ఈ నలుగురు తల్లులు ఒక్కటయ్యారు. వారే సైకాలజిస్ట్ సీమాలాల్, ఎంట్రపెన్యూర్ పద్మా పిైళ్లె, న్యాయవాది ప్రీతా అనూప్ మీనన్, బాలల హక్కుల కార్యకర్త, బధిర వివాహిత అనితా ప్రదీప్. వీరి కామన్‌పాయింట్ ఏంటంటే.. బధిరులపై థెరపీ కేంద్రాల్లో జరిగే అఘాయిత్యాలను అరికట్టడం. ఇందుకు టుగెదర్ వియ్ కెన్ అనే సంస్థను ఏర్పాటు చేసి.. ఆన్‌లైన్‌లో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. బాధితులను కూడగట్టి థెరపీ కేంద్రాల్లోకి తల్లిదండ్రులను అనుమతించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు, నకిలీ థెరపిస్టులను శిక్షించాలని, పిల్లల స్థితిపై నెలవారీగా నివేదికలు ఇవ్వాలని, పారదర్శకత కోసం జిల్లా కలెక్టర్ ఆధర్యంలో ఓ కమిటీ వేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి పోరాటానికి మానవహక్కుల సంఘం కూడా మద్దతిస్తున్నది. తమ దృష్టికి వచ్చిన కేసుల్లో ఎక్కువగా వైకల్యం ఉన్నవారిపైనే అఘాయిత్యాలు జరిగినట్లు వారు గుర్తించారు. అలాంటి వారికి వెన్నుదన్నుగా తమ గొంతుకను వినిపిస్తున్నారు ఈ మాతృమూర్తులు.

322
Tags

More News

VIRAL NEWS

Featured Articles