ఆ కేఫ్ ఉద్యోగులకు వినపడదు!


Thu,May 18, 2017 11:33 PM

ఆర్డర్ తీసుకోవడానికి, వినపడడానికి సంబంధం లేదని నిరూపించారు వారు. వినికిడి శక్తి కోల్పోయిన వారు, తమ సైగల ద్వారానే ఇతరులకు కూడా నేర్పించే సెంటర్‌గా ఆ కేఫ్‌ని మార్చేశారు.
cafe
స్మృతి నాగ్‌పాల్, విరాట్ సునేజ.. ఇద్దరూ కలిసి ఢిల్లీలో ఓ కేఫ్ ప్రారంభించారు. వీళ్లు పెట్టిన కేఫ్‌కు ఓ సామాజిక కోణం ఉంది. చెవిటి వారి కోసమే ప్రత్యేకంగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన వీరిది.ఇద్దరు కజిన్స్. వారికి చెవులు వినపడవు. వారితో చిన్నప్పటి నుంచే సైగలు చేసి ఆ సైగల భాష మొత్తం స్మృతికి అలవాటయింది. ఆ స్కిల్ వల్లే దూరదర్శన్‌లో సైన్ లాంగ్వేజ్ ద్వారా వార్తలు చెప్పే ఉద్యోగం కూడా సాధించింది. అయితే.. కేవలం బధిరుల కోసమే ఓ కేఫ్ పెట్టాలన్న ఆలోచన స్మృతికి వచ్చింది. దాన్ని కాస్త విరాట్‌తో పంచుకున్నది. ఇద్దరూ కలిసి ఆలోచించారు. ఉద్యోగులందరినీ బధిరులనే తీసుకుని, కేవలం సైన్ లాంగ్వేజ్ ద్వారానే ఆర్డర్లు ఇచ్చేలా, తీసుకునేలా ఉంటే వినూత్నంగా అనుకున్నారు. అదే అమలు చేశారు. వినడానికి అని అర్థం వచ్చేలా హియర్‌కెన్ అనే పేరు పెట్టారు. ఆ కేఫ్‌కి వచ్చినవారెవరూ మాట్లాడకూడదు. కేవలం సైగల ద్వారా మాత్రమే ఆర్డర్ ఇవ్వాలి. కొత్తలో కొంతమంది ఇబ్బంది పడ్డా.. ఇప్పుడు ఆ కేఫ్‌కి రావడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆ కేఫ్‌లో సైగల భాష ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఢిల్లీలో ఈ కేఫ్ ఇప్పుడు ఫేమస్ అవుతున్నది.

896
Tags

More News

VIRAL NEWS