ఆ ఆశకు అర్థం లేదు!


Sun,July 16, 2017 01:49 AM

చిత్రసీమలో గెలుపు, ఓటములు సహజం. ఓడిన చోట గెలువడమే నిజమైన విజయంగా చెప్పవచ్చు. అందుకు జగపతిబాబు జీవితమే ప్రత్యక్షసాక్ష్యం. పరాజయాల కారణంగా కథానాయకుడిగా అవకాశాలు కనుమరుగవడంతో ఆయన సినీ కెరీర్ ముగిసిపోయిందని అందరూ భావించారు. కానీ ప్రతినాయకుడిగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన తిరిగి పూర్వవైభవాన్ని సొంతం చేసుకున్నారు. జీవితంలో కష్టసుఖాలు సహజమని, వాటిని ధైర్యంగా అధిగమించడమే నిజమైన విజయమని చెబుతున్నారు జగపతిబాబు. ఆయన మనుసులోని మాటలవి..
jagapatibabu

ముక్కుసూటితత్వం వల్ల ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?

-అబద్దంలో బతుకడం నాకు నచ్చదు. ఏదైనా దాచుకున్నప్పుడే ఇబ్బందులు ఎదురవుతాయి. నిజాలు చెప్పేస్తే ఏమీకాదు. మనసులో ఉన్నది మాట్లాడుకున్నప్పుడే భారం తొలిగిపోతుందని నమ్ముతాను.

హీరోగా ఉన్నప్పటితో పోలిస్తే ప్రతినాయకుడిగా మారిన తర్వాత పారితోషికం పరంగా సంతోషంగా ఉన్నారా?

-డబ్బుకు నేను ప్రాధాన్యమివ్వను. అవసరానికి మించి ధనం అవసరం లేదు. నాకైతే నలభై కోట్లు చాలు. వందలు, వేల కోట్లు నాకు వద్దు. డబ్బుకు లిమిట్ అంటూ ఉండదు. ఎంత సంపాదించినా ఇంకా కావాలనిపిస్తుంది. ఇంతకంటే ఎక్కువ వద్దు అనుకున్నరోజు జీవితం హ్యాపీగా మారిపోతుంది. డబ్బు సంపాదించడం తప్పుకాదు. కానీ దానికి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. తప్పుడు దారుల్లో వెళ్లాల్సిన పనిలేదు.

దంగల్ ఆమిర్‌ఖాన్ తరహా పాత్ర వస్తే నటిస్తారా?

-అందానికంటే అభినయమే ముఖ్యమనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. ఎంత చాలెంజింగ్‌గా ఉంటే అంత సంతృప్తి ఉంటుంది. దర్శకుడు నన్ను ఎక్కువ కష్టపెట్టాలనే కోరుకుంటున్నాను. పాత్ర డిమాండ్ చేస్తే ఏం చేయడానికైనా సిద్ధమే. అలాంటి మొహమాటాలు లేవు.

మీ స్నేహితుడు అర్జున్ మీ బాటలోనే విలన్‌గా అడుగులు వేస్తున్నారు. మీతో ఆ విషయాన్ని ఎప్పుడైనా చర్చించారా?

-లైలో నటిస్తున్నాడని తెలుసు. కానీ ఏ పాత్ర చేస్తున్నాడో మాత్రం తెలియదు. అలాంటివి నేను అడుగను. ఇతరులు చెప్పిందే వింటాను. కానీ వారి విషయాల్లో జోక్యం చేసుకోను.

ైస్టెలిష్, ధనవంతుడైన తండ్రి పాత్రలు బోర్ కొట్టడం లేదా?

-అలాంటి పాత్రల నుంచి నేను వైవిధ్యం ఒకదానికి పేరు వస్తే ప్రతిసారీ అలాంటి పాత్రలే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆ ట్రెండ్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నది. ప్రస్తుతం నా విషయంలో అదే జరుగుతున్నది. ప్రయోగాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కథానాయకుడు సినిమాలో బార్బర్‌గా నటించా. అలాంటి ప్రయోగాత్మక పాత్రల్లో నటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. తమిళంలో దర్శకుడు సెల్వరాఘవన్‌తో ఓ ప్రయోగాత్మక సినిమాను అంగీకరించాను. కానీ అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది.

మీ జీవితం ఆధారంగా సముద్రం అనే టెలీఫిల్మ్ తీస్తున్నారని తెలిసింది?

-ప్రస్తుతం చిత్రీకరణ సాగుతున్నది. జీవితానికి ముగింపు ఉండదు. కష్టాలు, అపజయాలు అనేవి సర్వసాధారణం. వాటిని దాటుకొని ముందుకుపోవాలి. అక్కడే ఆగిపోకూడదు. కొత్త దారుల్ని అన్వేషిస్తూ కోల్పోయిన జీవితాన్ని తిరిగి పోందాలనే అంశాన్ని అందులో చెప్పబోతున్నాం.


ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచన ధోరణుల్లో మార్పులు వచ్చాయని అనుకుంటున్నారా?

-మంచి సినిమాలు వస్తే ఆదరించే ధోరణి ప్రేక్షకుల్లో ఎప్పటి నుంచో ఉన్నది. వారి అభిరుచుల్లో ఎలాంటి మార్పులు రాలేదు. పెళ్లి చూపులు లాంటి సినిమాలు దానిని నిరూపించాయి.

హీరోగా మళ్లీ మంచి కథలు వస్తే చేస్తారా?

-హీరోగా నటించాలనే ఉత్సుకత రేకెత్తించే పాత్రలు వస్తే ఆలోచిస్తాను. కానీ ఇప్పుడు కాదు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని నటిస్తాను. ప్రస్తుతం సహాయక పాత్రలపై దృష్టిసారిస్తున్నాను. చిన్నా, పెద్దా అనే తేడాలేవి నాకు లేవు. గుంపులో గోవిందా మాదిరిగా కాకుండా హీరో తర్వాత నా పాత్రకు పేరుండాలి.

ప్రమోషన్స్‌లో హీరో తర్వాత మీకు ప్రాముఖ్యం అనుకుంటున్నారా?

-నాన్నగారి హయాంలో ఓ సినిమా పోస్టర్‌లో గుమ్మడి, ఎస్వీఆర్‌తో పాటు నటులందరూ కనిపించేవారు. కథల్లో వారి పాత్రలకు ప్రాధాన్యం ప్రస్తుతం చిత్రసీమలో కమర్షియాలిటీ పెరిగింది. హీరోయిజమే విజయాలను నిర్ణయిస్తుంది. అలాంటప్పుడు నన్ను పోస్టర్స్‌లో చూపించాలని ఆశపడడంలో అర్థం లేదు. కానీ నేను బాగా చేశానని పేరు వస్తే చాలనుకుంటాను. నేనుగా వెళ్లి ఎవరినీ అడుక్కోలేను.

హీరోగా చేసేటప్పుడు మార్కెట్ లెక్కలు వేసుకున్నారా?

-ఆ లెక్కలు నాకు తెలియవు. వాటి గురించి ఆలోచించలేదు. కానీ నేను అనుకున్నదానికంటే ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తుందని అనుకుంటున్నాను. సహాయక పాత్రలు చేస్తూ సంతోషంగా ఉన్నప్పుడు హీరోగా చేయడం ఎందుకు అని నా భార్య ఓ సందర్భంలో చెప్పింది. నాకు ఆ టెన్షన్ అవసరం లేదనిపించింది. ఇతర పాత్రలు చేస్తే ఇంతకంటే ఎక్కువ డబ్బులొస్తాయి.

మీ జీవితంలోని కష్టాల్ని ఎలా అధిగమించగలిగారు?


Jagapathi-Babu
-లెజెండ్ సినిమాకు ముందు రెండేళ్ల పాటు చాలా కష్టాలు పడ్డాను. ఆ విషయం అందరికీ తెలుసు. దాచాల్సిన పనిలేదు. సమస్యను చూసి భయపడితే అది ఎప్పటికీ సమస్యగానే ఉంటుంది. దానిని ఓ అనుభవపాఠంగా భావిస్తే పరిష్కారంగా ఉపయోగపడుతుంది అనేది తెలిసింది. డబ్బు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవి లేనప్పుడే సమస్యలు ఉత్పన్నమవుతాయి. నా జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆలోచనా విధానాన్ని మార్చింది. జీవితంలో బాధపడటానికి ఏమి లేదని దాని ద్వారా తెలుసుకున్నాను.

523
Tags

More News

VIRAL NEWS