ఆవుపేడతో.. అదిరేటి డ్రెస్!


Sat,August 4, 2018 11:30 PM

కొత్త కొత్త ఫ్యాబ్రిక్‌లతో డ్రెస్‌లను కుట్టడం చూశాం. చివరకి ఆవుపేడతో కూడా అదిరిపోయే డ్రెస్‌ని కుట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. పైగా ఈ డ్రెస్ 1.40 కోట్ల నగదు బహుమతిని అందుకోవడం ఇక్కడ విశేషం.
cow-dress
రోజుకో కొత్త ఫ్యాషన్ మనల్ని పలకరిస్తుంది. దానికి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్‌లను ఎంచుకోవడం తెలుసు. కానీ ఆవు పేడ నుంచి సెల్యూలోజ్‌ని వేరు చేసి దాంతో ఫ్యాబ్రిక్ చేయాలనే ఆలోచన మాత్రం కొత్తగా ఉంది. గోమూత్రం, ఆవుపేడకు ప్రాధాన్యం ఉందని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఆ తర్వాత వీటి విశిష్టతను మరచిపోయి దాన్ని చులకన చేశారు. ఇప్పుడు అవే మళ్లీ మంచివని ఆదరిస్తున్నారు. ఒక స్టార్టప్ కంపెనీ కూడా అదే పని చేసింది. బయోఆర్ట్ ఎక్స్‌పర్ట్ జలీలా ఎసాయిదీ ఈ కంపెనీని నిర్వహిస్తున్నది. జలీలా దీన్ని భవిష్యత్‌లో బూమ్‌లో ఉండే ఫ్యాబ్రిక్ అని చెబుతున్నది. ఆవుపేడతో ఇప్పటికే బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్, పేపర్‌ని రూపొందించారు. అలాగే దాంతో నేను ఫ్యాబ్రిక్‌ని తయారు చేయాలనుకున్నాను. అది సక్సెస్ అయింది. దీంతో రూపొందించి దుస్తులు ఎంతో అందంగా ఉంటాయని అంటున్నదీ డిజైనర్. అయితే ఈమె రూపొందించిన ఈ డ్రెస్‌ని చివాజ్ వెంచర్ అండ్ హెచ్‌ఎం ఫౌండేషన్ గ్లోబల్ అవార్డుకి పంపించింది. అందులో ఆమెకు రూ.1.40 కోట్ల నగదు బహుమతి లభించింది. దీంతో ఈ ఫ్యాబ్రిక్ కచ్చితంగా జలీలా చెప్పినట్టు టాప్‌లో ఉండడం ఖాయమంటున్నారు ఫ్యాషనిస్టులు.

379
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles