ఆల్‌బుఖారా!


Fri,August 31, 2018 01:21 AM

ఆల్‌బుఖారా పేరు వినగానే.. నోట్లో నీళ్లూరుతాయి. వగరుగా, తియ్యగా, ఉండే ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జ్వరంతో బాధపడేవారు ఈ పండు తింటే తక్షణ శక్తి వస్తుంది. ఇంకా ఈ పండు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
al-bukhara
-ఆల్‌బుఖారాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
-ఇందులోని సొర్బిటాల్, ఇసోటిన్ కాంపౌండ్లు జీర్ణశక్తిని క్రమబద్ధీకరించి, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
-ఈ పండులో పుష్కలంగా లభించే సి విటమిన్ ద్వారా రోగ నిరోధకశక్తి పెరిగి, ఇన్ఫెక్షన్లు, అల్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.
-శ్వాస సంబంధ క్యాన్సర్లకు ఆల్‌బుఖారా చెక్ పెడుతాయి.
-ఆస్తమా, ఆర్థరైటిస్, గుండెపోటు, క్యాన్సర్ నివారణకు ఈ పండ్లు దోహదపడుతాయి.
-ఇందులో అధిక మోతాదులో ఉండే ఫోలిక్ యాసిడ్, కాల్షియం గర్భిణులకు, పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి.
-చర్మ నిగారింపును ఈ పండ్లు మెరుగు పరుస్తాయి.

554
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles