ఆరోగ్య దేవతలు!


Sat,September 1, 2018 11:11 PM

Doctor-Couple
ట్రైబల్ ఏరియాల్లో నివసించేవారికి వైద్య సదుపాయాలు ఎలా ఉంటాయో తెలిసిందే. ప్రసవం జరుగుతున్నా.. ప్రాణం పోతున్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. అలాంటివారికి అండగా నిలుస్తున్నారు తమిళనాడుకు చెందిన దంపతులు. వృత్తిరీత్యా ఇద్దరు డాక్టర్లే. రెండు దశాబ్దాలుగా వేలామంది మంది అడవి బిడ్డలకు ఆరోగ్య భరోసా కల్పిస్తున్నారు. నేరుగా ప్రజలు ఉండే చోటుకే వెళ్లి వారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తున్నారు. వారే డాక్టర్ రేగి జార్జ్.. ఆయన భార్య డాక్టర్ లలితా రేగి. ఎంతో కష్టపడి చదువుకొని వైద్య వృత్తిలోకి వచ్చిన వీళ్లకు ట్రైబల్ ఏరియా ప్రజల ఆరోగ్య పరిస్థితి ఆలోచింపజేసింది. ఉద్యోగాలు వదిలేసి తమిళనాడులోని కల్రాయన్ గిరుల్లో ఉండే ప్రజలకు వైద్య సేవలందిస్తూ వారిచే ఆరోగ్య దేవతలుగా కీర్తింపబడుతున్నారు.

901
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles