ఆరోగ్యానికి పచ్చకర్పూరం


Wed,August 1, 2018 01:31 AM

కర్పూరం అనగానే చాలామంది కేవలం పూజలకు మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటారు. కానీ కర్పూరాన్ని ఆరోగ్యం కోసం కూడా ఉపయోగిస్తారు.
camohor
-కర్పూరాలలో రకాలున్నాయి. పచ్చ కర్పూరం, తెల్ల కర్పూరం కన్నా చాలా మంచిది. ఇది పలుకులుగా మార్కెట్లో దొరుకుతుంది. పచ్చ కర్పూరాన్ని రెండు పలుకులు తీసుకుని దానిలో కొంచెం మంచి గంధాన్ని కానీ, వెన్నను కానీ కలిపి, తమలపాకులో పెట్టి నమిలి రసాన్ని మింగితే వెంటనే వేడి తగ్గుతుంది. కళ్ళు బైర్లు కమ్మడం, తల తిరగడం, కడుపులో వికారం, అతిగా శరీరానికి చెమటలు పట్టడం తగ్గిపోతాయి.
-బీపీ ఉన్నవారు రోజుకు రెండుసార్లు పచ్చ కర్పూరాన్ని తింటే బీపీ రాకుండా అరికడుతుంది. మూత్రం పోసేటప్పుడు మంట, చీము, సుఖవ్యాధులు ఉన్నవారు పచ్చ కర్పూరాన్ని గంధంతో కలిపి తీసుకుంటే బాధలకు నివారణ లభిస్తుంది. వేడి చేయడం వల్ల కలిగే ఒళ్ళు మంటలు, అరికాళ్ళు, అరచేతుల మంటలు మొదలైనవాటికి పచ్చకర్పూరాన్ని గ్లాసుపాలతో తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
-పచ్చ కర్పూరం 5 గ్రాములు, జాజికాయ 5 గ్రాములు, జాపత్రి 5 గ్రాములు, ఎండుద్రాక్ష 5 గ్రాములు వేసి మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలుగా తయారు చేసి పెట్టుకుని రోజు పడుకోబోయే ముందు ఒక మాత్ర వేసుకుని పాలు తాగుతుంటే వీర్యం వృద్ధి చెందుతుంది. లైంగిక శక్తి బాగా పెరుగుతుంది. పచ్చ కర్పూరాన్ని రోజు ఒకటి రెండు పలుకులు తీసుకుంటే బలం, రక్తపుష్టి కలుగుతాయి. బీపీ తగ్గుతుంది.

542
Tags

More News

VIRAL NEWS