ఆయుర్వేదంతో సయాటికా మాయం


Tue,April 19, 2016 11:04 PM

homeopathyనడుము నొప్పి వెన్నునొప్పితో పాటు కాళ్లు లాగడం తిమ్మిరిపట్టడం, కాళ్లు మండుతుండడం, 15 నిమిషాలకు మించి కూర్చొలేకపోవడం, 10 నిమిషాలు నడవగానే నడుము నొప్పి రావడం, కొద్ది బరువు కూడా ఎత్తలేకపోవడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తుంటాయి. మరికొందరిలో కాళ్లు పట్టేసినట్టు, కరెంట్ షాక్ తగిలినట్టు నరాలు జిల్లుమనడం, కాళ్లలో చీమలు పాకినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ పైకీ వేర్వేరు సమస్యలుగానే కనిపిస్తాయి. వీటన్నింటికీ కండరాలు, ఎముకలు, డిస్క్‌లు, నాడులు వీటిలో ఏర్పడిన సమస్యలే కారణం. వీటి మధ్య ఏర్పడిన తేడాల వల్ల సయాటికా నాడి మీద ఒత్తిడి పెరగడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి.

కారణం
కండరం బలహీనపడడానికి కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోవడం, ఎక్కువ సమయం పాటు కూర్చొవడం, శక్తికి మించిన బరువులు ఎత్తడం వంటి కారణాలతో వెన్నెముక మీద భారం పెరిగి వెన్నుపూసల మధ్య దూరం తగ్గుతుంది. ఫలితంగా సయాటికా నాడి మీద ఒత్తిడి పెరుగుతుంది. అయితే పిరిఫార్మిక్ సిండ్రోమ్‌లో కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. కానీ చికిత్స వేరుగా ఉంటుంది. డీ జెనరేటివ్ డిస్క్ వల్ల కూడా సయాటికా సమస్య రావచ్చు. స్పైనల్ స్టీనోసిస్, పెల్విక్ ఇంజూరీ వంటివి కూడా సయాటికా సమస్యకు కారణం కావచ్చు. లక్షణాలు ఒకేలా అనిపించినప్పటికీ కారణాలు వేరుగా ఉంటాయి.

లక్షణాలు
తొలిదశలో నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. కాస్త నడిచినా, వ్యాయామం చేసినా, తైల మర్థనం చేసినా నొప్పి తగ్గిపోతుంది. కొంతమందిలో ఉదయం సాయంత్రం వరకు నొప్పి ఉన్నప్పటికి సాయత్రం వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. ఈ స్థాయిలో జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే కండరాలతో పాటు లిగమెంట్ల మీద కూడా భారం పడుతుంది. అప్పుడు లిగమెంట్లు కూడా దగ్గరగా వచ్చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే నడుము నొప్పితో పాటు కాళ్లలో తిమ్మిర్లు, పిక్కల్లో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో ఎప్పుడైతే నాడుల మీద ఒత్తిడి పెరుగుతుందో ఆ భాగం అంతా లాగడం, తిమ్మిర్లు, మంటలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చక్కని పరిష్కారం
ఆయుర్వేద వైద్య విధానంలో పంచకర్మ చికిత్సల ద్వారా ప్రత్యేకించి వస్తి చికిత్సల ద్వారా ఆ డిస్క్‌ను చక్కదిద్దవచ్చు. ఆధునిక వైద్య విధానంలో ల్యామినెక్టమి బయటికి పొడుకుచు వచ్చిన డిస్క్‌ను కత్తిరించి వదిలేస్తారు. దీని వల్ల ఓ ఆరు మాసాలో, సంవత్సరమో ఉపశమనంగా ఉంటుంది. ఆ తర్వాత సమస్య మొదటికొస్తుంది. అంటే ఎల్-4, ఎల్-5 వద్ద సమస్య ఉందని సర్జరీ చేస్తే, ఆ తర్వాత ఎల్-3, ఎల్-4 వద్ద కొత్తగా సమస్య మొదలవుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్య తలెత్తుతూనే ఉంటుంది. నొప్పి అలా ఏళ్ల పర్యంతం కొనసాగుతూనే ఉంటుంది. వెన్నుపూస విరిగిపోయిన సందర్భాల్లో తప్ప మిగతా ఏసందర్భంలో అయినా సర్జరీతో దుష్ప్రభావాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఆయుర్వేదంలో వస్తి చికిత్సలు ఉంటాయి. మేరు వజ్రీకరణ చికిత్సలు ఉంటాయి. లేపనం అభ్యంగం, నాడీ స్వేదం, సానిక ధార అనే నాలుగు దశల్లో ఈ చికిత్స ఉంటుంది. రెండవ దశలో కటి వస్తి, ఎలకిడి, నవరకిడి, వస్తి చికిత్సలు ఉంటాయి. ఇటీవల వేస్టనం అనే మరో ప్రత్యేక చికిత్స ద్వారా వెన్నుపూసలను తిరగి పూర్వ స్థానానికి చేర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ చికిత్సల వల్ల వారం రోజుల్లోనే గొప్ప రిలీఫ్ లభిస్తుంది. ఆ తర్వాత చేసే మిగతా చికిత్సలతో ప్రత్యేకించి పంచకర్మ చికిత్సలతో సమస్యలన్నీ సమూలంగా తొలగిపోతాయి.

1751
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles