ఆయిలీ స్కిన్ .. ఏం చేయాలి?


Thu,August 24, 2017 01:32 AM

మా పాప వయసు 16 సంవత్సరాలు. ఆమె చర్మం ఆయిలీ స్కిన్ రకం అనిపిస్తున్నది. అవుట్‌డోర్ గేమ్స్ ఆడడం ఆమెకు చాలా ఇష్టం. చాలా సమయం ప్లే గ్రౌండ్‌లోనే గడుపుతుంది. ఆమె చర్మం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో కాస్త వివరంగా తెలుపగలరు?
- వేద, హైదరాబాద్

healthy-skin
ఇలా చర్మ సంరక్షణ గురించిన ఆలోచన మీకు ఉన్నందుకు ముందుగా నా అభినందనలు. ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్న పిల్లల చర్మ సంరక్షణ గురించి మరింత శ్రద్ధ అవసరం. మీ పాప ఎక్కువగా అవుట్ డోర్‌లోనే గడుపుతుందంటున్నారు కాబట్టి ఆమె తప్పకుండా చర్మానికి సంబంధించిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా సన్‌స్క్రీన్ వాడాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి వాతావరణ స్థితిని బట్టి, ఎంత సమయం పాటు తాను ఆరు బయట గడుపుతున్నది అనే దాన్ని బట్టి 15-40 ఎస్‌పీఎఫ్ కలిగిన సన్‌స్క్రీన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలా సన్‌స్క్రీన్ ఉపయోగించడం వల్ల చర్మం మీద సన్నని గీతల వంటి ముడుతలు, ఎండకు చర్మం నల్లబారడం వంటి వాటిని నివారించవచ్చు. ఆమెది ఆయిలీ స్కిన్ రకం అంటున్నారు కాబట్టి సాల్సిలిక్ యాసిడ్ కలిగిన ఫేస్ వాష్, వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడడం మంచిది.

సరైన ఎస్‌పీఎఫ్ కలిగిన సన్‌స్క్రీన్, సాల్సిలిక్ యాసిడ్ కలిగిన ఫేస్ వాష్ రాత్రి పూట వాడే నైట్ క్రీమ్ లేదా సీరమ్ లేదంటే సాధారణ వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఉపయోగించడం వంటి జాగ్రత్తలతో పాటు, తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. సమతుల పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండే వారి చర్మం కూడా ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుందనే విషయం గుర్తుంచుకోండి.
DRharish

379
Tags

More News

VIRAL NEWS