ఆటోఇమ్యూన్ వ్యాధులకు హోమియో


Wed,January 20, 2016 12:59 AM

శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడడానికి, వ్యాధి కారక జీవులతో పోరాడడానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఇది ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. రక్షణ వ్యవస్థ శరీరంలో ఈ వ్యవస్థలో లోపం ఉంటే అది పొరబడి తన సొంత శరీరంపైనే, సొంత కణజాలం పైనే దాడిచేస్తుంది. తద్వారా థైరాయిడ్ సమస్యలు, ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్, తెల్లమచ్చలు, సొరియాసిస్ వంటి వ్యాధులు వచ్చిపడతాయి. అందుకే వీటిని ఆటో ఇమ్యూన్ వ్యాధులని అంటారు. దీనివల్ల డయాబెటిస్, రక్తహీనత, కండరాల నొప్పులు, చర్మ సమస్యలు, ల్యూపర్ ఎరిథిమేటస్ (ఎస్‌ఎల్‌ఈ), కిడ్నీ సమస్యలు, ఎడిసన్స్ డిసీజ్, పల్మనరీ థైబ్రోసిస్ వంటి సమస్యలు కూడా వస్తాయి. 75 శాతం మంది స్త్రీలు ఈ వ్యాధులతో బాధపడుతుంటారు.

కారణాలు
బాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్లు. రసాయనాలు, వాతావరణ కాలుష్యం. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

లక్షణాలు
-కండరాల నొప్పి, నీరసం, జ్వరం, అలసట.
-కీళ్లనొప్పులు, చర్మం, రక్తకణాలు, రక్తనాళాల వంటి భాగాలు ఎక్కువ ప్రభావితం అవుతాయి.
ఆటో యాంటీబాడీస్ టెస్టులు, సి-రియాక్టివ్ ప్రొటీన్ పరీక్ష, ఇఎస్‌ఆర్, సిబిపి, ఎరిత్రోసైట్ సెడిమెంటేషన్ రేటు.

ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్


ఇదొక ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్. జీవక్రియలో ఏర్పడే అసమతుల్యత వల్ల తలెత్తే ఆటో ఇమ్యూన్ వ్యాధి. శరీరంలో ఇరుపక్కల్లో ఉండే కీళ్లకు సమాంతరంగా వ్యాప్తి చెందుతుంది. కీళ్లు తీవ్రంగా వాచిపోవడం వల్ల వాటి కదలికలు స్తంభిస్తాయి. తద్వారా కీళ్ల వైకల్యానికి గురవుతారు. కీళ్ల నొప్పులు, వాపు, కీళ్లు పట్టేయడం, రక్షణ వ్యవస్థ మోకాలి సైనోవియమ్ అనే పొరపై పనిచేసి, వాపు వస్తుంది. కీళ్లు మాత్రమే కాకుండా కళ్లు, నోరు, ఊపిరితిత్తులకు కూడా వ్యాధి విస్తరిస్తుంది.

థైరాయిడ్ సమస్యలు


శరీరంలో తయారయ్యే యాంటీబాడీలు థైరాయిడ్ గ్రంథిని చేరుతాయి. దీనికి కొన్ని నెలల నుంచి సంవత్సరాలు పట్టవచ్చు. రేడియేషన్ చికిత్స చేసినప్పుడు థైరాయిడ్ గ్రంథి దెబ్బతిని హైపోథైరాయిడిజమ్ రావొచ్చు. హైపర్‌థైరాయిడ్ వస్తే దాన్ని గ్రేవ్స్ డిసీజ్ అంటారు.

లక్షణాలు
మలబద్దకం, డిప్రెషన్, నీరసం, అలసట. వెంట్రుకలు రాలిపోవడం, గోళ్లు విరగడం. కాళ్లూచేతుల్లో వాపు, గొంతు బొంగురుపోవడం
టి3, టి4, టిఎస్‌హెచ్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, సిబిపి, ఎల్‌ఎఫ్‌టి, ప్రొలాక్టిన్ మొదలైన పరీక్షలు చేయించుకోవాలి.

సొరియాసిస్


సొరియాసిస్ దీర్ఘకాలపు చర్మవ్యాధి. ఎక్కువగా వంశపారంపర్యంగా కనిపిస్తుంది. ఇది పొలుసుల మాదిరిగా వచ్చే చర్మవ్యాధి. దురద, ఎర్రమచ్చలు శరీరమంతా వ్యాపిస్తాయి. ఈ వ్యాధి స్త్రీ, పురుషులకు సమానంగా వస్తుంది. ప్రపంచ జనాభాలో మూడు శాతం మందిలో కనిపిస్తుంది. ఇది సామాజిక రుగ్మతకు, మానసిక అశాంతికి దారితీస్తుంది. ఇది ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరిచేతులు, అరికాళ్లు, ఉదరంపై, మెడ, నుదురు, చెవులు మొదలైన భాగాల్లో వ్యాపిస్తుంది.

లక్షణాలు
-చర్మం ఎర్రబడడం, జుట్టు రాలిపోవడం, కీళ్లనొప్పులు
-చర్మం పొడిబారినప్పుడు చర్మంపై పగుళ్లు ఏర్పడటంతో పాటు రక్తస్రావం అవుతుంది.
స్కిన్ బయాప్సీ, ఇఎస్‌ఆర్, సిబిపి, ఎక్స్‌రే

హోమియో చికిత్స
హోమియో వైద్య విధానంలో వ్యాధి లక్షణాలు, మానసిక, శారీరక స్థితిగతులు, ఆహార విహారాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స అందిస్తారు. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అన్నింటికీ హోమియోలో మంచి మందులున్నాయి. వీటితో ఎలాంటి దుష్ప్రభావాలుండవు.

murali

1605
Tags

More News

VIRAL NEWS