ఆటిజానికి మంచి మందు


Wed,May 10, 2017 12:21 AM

ఆటిజం బాధితుల తత్వమే వేరు. వీరు ప్రపంచంలో దేనితోనూ తనకు సంబంధమే లేనట్లు ఉండిపోతారు. ఇదేదో వైరాగ్యం అని కాదు. ఇదొక నాడీ సంబంధిత వ్యాధి. మెదడుకు శరీరానికి మధ్య ఉన్న సంబంధం తెగిపోవడమే ఈ వ్యాధికి కారణం. మెదడు, శరీరం మధ్య సమన్వయం లోపిస్తుంది. అందుకే మన మధ్య ఉన్నప్పటికీ లేనట్లే ప్రవర్తిస్తారు. ఇలాంటి వారికి సరైన చికిత్స ఇచ్చేదే స్వర్ణామృత ప్రాశన.

boy
శారీరక ఎదుగుదలతో సమానంగా మానసిక ఎదుగుదల లేకపోవడమే ఆటిజం ప్రధాన సమస్య. ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లలు ఏంచేస్తున్నదో తెలియని స్థితిలో ఉంటారు. ఆటిజం పిల్లలకు రెండేళ్ల వయసొచ్చినా స్పందనలు సరిగా ఉండవు. ఇతరుల విషయం అలా ఉంచి ఆ వయసులోనూ తల్లిదండ్రులనే గుర్తించలేరు. వీరికి వయసుతో పాటు రావల్సిన జ్ఞానమేదీ రాదు. విషయాల్ని గుర్తించే శక్తి ఉండదు. దీన్ని డిలేయిడ్ మైల్ స్టోన్స్ అంటారు. చివరికి పాకడం, నడువడం కూడా ఆలస్యమవుతుంది. ఎవరితోనూ కలువకుండా ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడుతారు. ఆటిజంలోనే కొంతమంది పిల్లల్లో అతిగా ప్రవర్తించే హైపర్ యాక్టివ్ లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది పిల్లలు దాదాపు మౌనంగానే ఉండిపోతే, మరి కొంత మంది పిల్లలేమో విపరీతంగా అల్లరి చేస్తుంటారు.

ఎలా గుర్తించాలి?


ఆటిజం రావడానికి గల కారణాల మాట ఎలా ఉన్నా, వచ్చిన వ్యాధిని గుర్తించడం ఎలా అన్నదే ముఖ్యమవుతుంది. ఇది కొంత కష్టమైన పనే. ఎందుకంటే పిల్లలకు మాటలు వచ్చే వయసొచ్చినపుడు గానీ ఆ తేడా ఏమిటో మన గమనానికి రాదు.
-ఎదుటి వారి కళ్లలోకి చూస్తూ ఎప్పుడూ మాట్లాడరు. ఈ పిల్లలకు మాట వచ్చినా ప్రతిసారీ రెండు పదాలకు మించి మాట్లాడరు. అయితే ఆ రెండు మాటల్నే పదేపదే చెబుతారు. ఎదుటివారు ఏ మాట అంటే అదే మాటను తిరిగి అనడం కూడా వీరిలో కనిపిస్తుంది.
-హైపర్ యాక్టివిటీ వీరిలో కనిపిస్తుంది. అన్ని విషయాల్లో అతిగా వ్యవహరించడం కనిపిస్తుంది. తనంతట తాను అరవడం, కేకలు వేయడం చేస్తుంటారు. ఒక్కనిమిషం కూడా స్థిరంగా నిలబడరు. అటూ ఇటూ కదలడం, పరుగులు తీయడం చేస్తుంటారు.
krishana

ఈ మందు ఎలా పనిచేస్తుంది?


ఆటిజంలోని ప్రధాన ససమ్య మెదడుకు శరీరానికి మధ్య సమన్వయం లేకపోవడం. ఈ స్థితిలో స్వర్ణామృతప్రాశన మెదడుకు శక్తినిస్తుంది. మొత్తం నాడీ వ్యవస్థను, మెదడులోని స్పీచ్ సెంటర్లను చైతన్యపరుస్తూ బాడీకి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అందుకే స్వర్ణామృత ప్రాశన వాడడం మొదలుపెట్టిన మొదటి రెండు నెలలలోపల మాట రావడాన్ని గమనించవచ్చు. అసలే మాటల్లేని పిల్లల నోట కొన్ని మాటలు రావడాన్ని గమనించవచ్చు. అసలే మాటల్లేని పిల్లల నోట కొన్ని మాటలైనా వస్తాయి. మూడోనెల నుంచి ఏదో ఒక్కవ్యక్తితోనే సన్నిహితంగా ఉండే స్థితి నుంచి తన చుట్టూ ఉండే నలుగురితో కలిసిపోవడం మొదలవుతుంది. నాలుగో నెలలో కాస్తంత అటెన్షన్ కూడా మొదలవుతుంది. ఎవరైనా పిలిస్తే పలుకడం, ఏదైనా పని చెబితే చేయడం గమనించవ్చు. ప్రతిసందర్భంలోనూ స్పష్టంగా మాట్లాడలేకపోయినా తొలుత సంజ్ఞల రూపంలోనైనా తన మనోభావాల్ని వ్యక్తం చెయ్యడం ప్రారంభిస్తారు. ఎవరి సాయం లేకుండా టాయిలెట్‌కు స్వతంత్రంగా వెళ్లడం అలవడుతుంది. 5వ నెల వచ్చేసరికి అప్పటిదాక ఉన్న హైపర్ యాక్టివ్‌నెస్ కూడా తగ్గుముఖం పడుతుంది. మెల్లమెల్లగా మొండితనం పోయి, బెరుకు వదిలేసి, ఎదుటి వాళ్లకళ్లలోకి సూటిగా, ఆత్మీయ దృష్టితో చూసే స్థితికి చేరుకుంటారు. ఆటిజం తాలూకు ఇతరత్రా లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడుతాయి.

585
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles