ఆకలి తీర్చే లక్ష్యం..


Fri,November 16, 2018 11:08 PM

రియా అగర్వాల్ హాస్టల్‌లో ఉండి చదువుకుంది. అప్పుడప్పుడు ఆమెకు అక్కడి వంటల రుచి నచ్చకపోయేది. ఒక్కోసారి హాస్టల్‌లో అన్నం చాలా మిగిలేది. అందరిలా డస్ట్‌బిన్‌లో పడేసేది కాదు. భిన్నంగా ఆలోచించి అన్నార్తుల ఆకలి తీర్చేది.
riya-agrawal
కోల్‌కత్తాలోని వైద్య కళాశాలలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్నది రియా. స్వర్ణమోయే బాలికల వసతి గృహంలో ఉంటున్నది. రోజూ వండిన ఆహారం మిగిలిపోవడమే కాకుండా వృథా అవుతున్నది. అది గమనించి రియాకు ఒక ఆలోచన వచ్చింది. ఎంత కష్టపడితే ఈ ఆహారం మనకు వస్తుంది. మనమంటే రుచికరమైన ఆహారాన్ని మూడు పూటలా తింటున్నాం. మిగిలితే పడేస్తున్నాం. మరి అన్నం దొరుకని వాళ్ల పరిస్థితి ఏంటి? అని ఆలోచించింది. ఆహారాన్ని వృథా చేయకుండా ఆ మిగిలిన ఆహారాన్ని ఫుట్‌పాత్‌లపై నివసించే అన్నార్తులకు ఇవ్వాలని అనుకున్నది. అలా ఒక రోజు వారికి మిగిలిపోయిన నూడిల్స్, వెజ్ మంచూరియాలను తీసుకెళ్లి వారి ఆకలి తీర్చింది. అప్పుడు వాళ్ల మొహల్లో ఆనందం చూసింది. చుట్టుపక్కల ఉన్నవాళ్ల స్పందనను గమనించింది. మనకు ఉన్నదాంట్లో కొంత పంచడంలో ఇంత ఆనందం ఉన్నదా? అని తెలుసుకున్నది. తోటి విద్యార్థులతో, హాస్టల్ యాజమాన్యంతో చర్చించి ప్రతి రోజూ తమ హాస్టల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను రోడ్లపై ఉండే పిల్లలకు, వృద్ధులకు ఇస్తున్నది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదని, డబ్బు ఇచ్చే దానికంటే అన్నంతో వారి కడుపు నింపడం మేలంటున్నది రియా అగర్వాల్.

721
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles