ఆండ్రాయిడ్ p ఆగయా!


Tue,August 7, 2018 11:21 PM

ఒకప్పుడు అవతలి వ్యక్తికి ఫోన్ చేయడానికి, మాట్లాడిన తర్వాత కాల్ కట్ చేయడానికి ఎర్ర బటన్, ఆకుపచ్చ బటన్ మాత్రమే ఉండేవి. కానీ సాంకేతిక అభివృద్ధి ఆ బటన్ల సంఖ్య పెంచింది. హలో.. అంటూ మాట వరకే పరిమితమైన టెక్నాలజీ ఇప్పుడు అవతలి వ్యక్తిని చూస్తూ మాట్లాడుకునేంతగా డెవలప్ అయింది. పలు దఫాలుగా అందుబాటులోకి వచ్చిన స్మార్టఫోన్ ఆండ్రాయిడ్ వెర్షన్లు మొబైల్ ప్రేమికులను అలరించాయి. ఇప్పుడు తాజాగా ఆండ్రాయిడ్ పి వెర్షన్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్టు 20న విడుదల కానున్న ఆండ్రాయిడ్ పి గురించి ప్రత్యేక కథనం..
android

ఎలా పనిచేస్తుందంటే..?

ఆండ్రాయిడ్ ప్రివ్యూ వెర్షన్ ఇప్పటికే మార్కెట్లో మంచి ఆదరణ పొంది గాడ్జెట్ ప్రియుల నుంచి మార్కులు కొట్టేసింది. త్వరలో రానున్న ఆండ్రాయిడ్ పి వెర్షన్ మరిన్ని ఫీచర్లతో మొబైల్ ప్రియులను ఆకట్టుకోనున్నది. కొన్ని ఫీచర్లు మాత్రమే లీక్ చేసి, మరిన్ని అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆశ్చర్యంలో ముంచెత్తడానికి సిద్ధమయిది ఆండ్రాయిడ్ పి వెర్షన్. ఐఫోన్ 10లో వచ్చే ఫీచర్లలాగే ఆండ్రాయిడ్ పి వెర్షన్ కూడా అన్నీ ఆండ్రాయిడ్ ఫోన్లలో అద్భుతమైన అనుభూతిని కలిగించనున్నది. మెసేజ్ నోటిఫికేషన్ రాగానే.. వాటిని స్వైప్‌డౌన్ చేసి దానికి ఏమైనా ఇమేజ్ అటాచ్ చేసి ఉంటే దాన్ని ఓపెన్ చేసుకునే వీలుంది. హోమ్‌స్క్రీన్‌లోనే నోటిఫికేషన్ బార్ నుంచి మెసేజ్‌లు చూడడంతో పాటు, రిైప్లె కూడా ఇవ్వవచ్చు. గ్రూప్ మెసేజ్‌లు కూడా పంపుకోవచ్చు. డేటా ఆదా చేసుకోవడానికి ఇమేజ్, వీడియో, ఆడియో ఫైల్‌ను కంప్రెస్ చేసుకోవచ్చు. కంప్రెస్ చేసినప్పటికీ ఆండ్రాయిడ్ పి వెర్షన్ ద్వారా క్వాలిటీ ఏమాత్రం తగ్గదు.


మొబైల్‌లో సులభంగా మల్టీటాస్కింగ్ చేసుకునేలా ఆండ్రాయిడ్ పి సపోర్ట్ చేస్తుంది. అంతకు ముందు ఓపెన్ చేసిన యాప్‌ను ఫుల్‌స్క్రీన్‌లో ప్రివ్యూ చూపిస్తూనే.. సెట్టింగ్స్, నోటిఫికేషన్స్, క్విక్‌సెట్టింగ్ లాంటి ఆప్షన్లన్నీ సులభంగా ఆపరేట్ చేసుకునే సదుపాయం ఆండ్రాయిడ్ పి వెర్షన్ కల్పిస్తున్నది. ప్రస్తుతం చాలా ఫోన్లలో ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఓరియో వెర్షన్ ఆండ్రాయిడ్ అందుబాటులో లేని వారికి ఆండ్రాయిడ్ పి సదుపాయం వర్తించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నది. ఫేస్ అన్‌లాక్ ఆప్షన్ లేని ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ వెర్షన్ ద్వారా ఆ ఫీచర్ ఐరిస్ స్కానర్ సపోర్ట్ ఇస్తున్నట్టు సంస్థ తెలిపింది. దీని వల్ల ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లందరూ ఉపయోగించుకునే వీలుంది.


android4
మొబైల్ వాడే వ్యక్తి ఫొటోతో కూడా ఫోన్ అన్‌లాక్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ పి వెర్షన్‌లోని మల్టిపుల్ కెమెరా ఫీచర్ ద్వారా ఏకకాలంలో ఫ్రంట్ మరియు బ్యాక్ కెమెరాలతో ఒకేసారి ఫొటో తీసుకొవచ్చు. ప్రస్తుతం ఉన్న అన్నీ ఫోన్లలో మొబైల్ నెట్‌వర్క్ ఎంత ఉందో తెలుసుకోవడానికి సిగ్నల్ బార్లు ఉంటాయి. కానీ ఆండ్రాయిడ్ పి వెర్షన్ ద్వారా సిగ్నల్ బార్స్ కాకుండా సిమ్ స్టేటస్ అనే ఆప్షన్ రానున్నదని సమాచారం. ఒకటి కన్నా ఎక్కువ యాప్‌లను ఒకేసారి వాడుకునేందుకు గానూ.. సిస్టమ్ నావిగేషన్ గెస్చర్‌లను పూర్తిగా మార్చేశారు. ఏఐ పవర్డ్ యాప్ యాక్షన్ అనే ఫీచర్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆండ్రాయిడ్ పి వెర్షన్‌ను తీర్చిదిద్దారు. ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు ఏం చేయాలనే కమాండ్‌ను ముందుగానే యాప్‌కి ఆర్డర్ చేస్తే ప్రతీసారి మనం ఆ యాప్ ఓపెన్ చేయగానే యాప్ పనిచేయడం మొదలుపెడుతుంది. ఉదాహరణకు.. హెడ్‌సెట్ పెట్టగానే.. మ్యూజిక్ యాప్ ఓపెన్ అయి పాటలు ప్లే అవుతాయి.


android2
ఆండ్రాయిడ్ పి వెర్షన్‌లోని మల్టిపుల్ కెమెరా ఫీచర్ ద్వారా ఏకకాలంలో ఫ్రంట్ మరియు బ్యాక్ కెమెరాలతో ఒకేసారి ఫొటో తీసుకొవచ్చు. ప్రస్తుతం ఉన్న అన్నీ ఫోన్లలో మొబైల్ నెట్‌వర్క్ ఎంత ఉందో తెలుసుకోవడానికి సిగ్నల్ బార్లు ఉంటాయి.


android3

ఆండ్రాయిడ్ పి అంటే..

ఇప్పటివరకు ఆండ్రాయిడ్ పి అంటే చాలామంది చాలారకాల పేర్లను ప్రస్తావించారు. ఆండ్రాయిడ్ పీనట్ అని, ఆండ్రాయిడ్ పాన్‌కేక్ అని, పీనట్ బటర్ అని రకరకాలుగా ఊహించారు. అయితే.. ఫిబ్రవరిలో బ్లూమ్‌బర్గ్ నివేదిక ఆండ్రాయిడ్ పి వెర్షన్‌ని పిస్తా ఐస్‌క్రీమ్ అని చెప్పింది. ఈ నెల 20న విడుదలయ్యే ఆండ్రాయిడ్ పి పిస్తా ఐస్‌క్రీమ్ గానూ గూగుల్ ప్రకటించే అవకాశం ఉంది. కొత్త ఈమోజీలు, సెట్టింగుల్లో మార్పులు, ప్రతి ఐకాన్‌ను ప్రత్యేక రంగు, సరికొత్త నోటిఫికేషన్ బార్, స్టిక్కర్స్, మెసేజింగ్ యాప్‌లో జోడించిన సరికొత్త టూల్స్ ద్వారా మెసేజులకు రిైప్లె వేగంగా ఇచ్చే ఆప్షన్ ఇలా ఎన్నో కొత్త ఫీచర్లున్నాయి. బ్యాటరీ లైఫ్‌టైమ్ కూడా పెరిగే అవకాశం ఉన్నది. మెషిన్ లెర్నింగ్ సహాయంతో బ్యాటరీ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుంది. యూజర్లు ఎక్కువగా వాడే యాప్‌లను, ఎప్పుడో ఒకసారి వాడే యాప్‌లను విభజించి అనవసర బ్యాటరీ ఖర్చును నియంత్రించే ఫీచర్‌ను డెవలప్ చేశారు.

715
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles