అసిడిటీ


Wed,June 22, 2016 01:13 AM

ఈ మధ్య కాలంలో చాలామందిని వేధించే జీర్ణ సమస్యలలో అసిడిటీ ఒకటి. ఛాతిలో మంట, పుల్లటి తేన్పులు, గొంతులో ఏదో అడ్డం పడినట్లు ఉండడం వంటి అసిడిటీ సమస్యలకు ప్రధాన కారణం గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్.స్థూలకాయం, పొగతాగడం, ఉబ్బసం, రక్తపోటు వంటి సమస్యలు ఇందుకు ప్రధాన కారణం. ఇలా చాలా మందిని వేధించే ఈ సమస్య నిర్లక్ష్యం చేస్తే అన్నవాహిక, స్వరపేటిక దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిపాటి అవగాహన కలిగివుండి, ప్రాథమిక దశలో చికిత్స తీసుకోవడం వల్ల జీఈఆర్‌డీ సమస్య దరిచేరకుండా కాపాడవచ్చు.
-అసిడిటీకి గల కారణాలు అనేకం. అందులో ప్రధానమైనది గ్యాస్ట్రో-ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ). ఇది జీర్ణాశయానికి సంబంధించిన ఒక దీర్ఘకాలిక సమస్య. జీర్ణాశయంలో ఉండే ఆమ్లాలు పైకి అంటే అన్నవాహికలోకి ఎగదన్నుకు రావడాన్నే జీఈఆర్‌డీ అని అంటారు.
-మనం తీసుకున్న ఆహారం గొంతు నుంచి అన్నవాహిక ద్వారా కిందకు జారుతూ జీర్ణాశయంలోకి చేరుతుంది. ఈ జీర్ణాశయంలో జీర్ణప్రక్రియకు అవసరమైన గాఢమైన ఆమ్లాలు, రకరకాల రసాయనాలు ఉంటాయి. ఇవి ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడతాయి. ఇలా మనం తిన్న ఆహారం, ఆమ్లాలు జీర్ణాశయం నుంచి పైకి ఎగదన్నకుండా అన్నవాహిక చివర స్పింక్టర్ లేదా కండర కవాటం ఉంటుంది. ఇది మనం ఆహారం తీసుకున్నప్పుడు తెరుచుకోవడం, ఆ తరవుఆత వెంటనే జీర్ణాశయంలోకి వెళ్లిన ఆహారం, ఆమ్లాలు పైకి ఎగదన్నుకు రాకుండా గట్టిగా మూసుకుపోవడం జరుగుతుంది. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. అయితే కొందరిలో ఈ కండర కవాటం వదులుకావడం వల్ల కొంత ఆమ్లం పైకి అంటే అన్నవాహికలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇదే అసిడిటీకి గల మూల కారణం. దీన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అని అంటారు.

కారణాలు
-హయాటస్ హెర్నియా
-తిన్న వెంటనే పడుకోవడం, ముందుకు వంగడం
-నొప్పి నివారిణి మాత్రలు అపరిమితంగా వాడడం
-కొందరిలో ఆమ్లాల ఉత్పత్తి అధికమవడం.
-పొగతాగడం, మద్యం సేవించడం, ఆహారం ఒకేసారి అధిక మొత్తంలో తీసుకోవడం, మసాలాలు, వేపుళ్లు, చాక్లెట్లు, టయోట, నిమ్మజాతి పళ్లు తీసుకోవడం
-స్థూలకాయం, గర్భిణుల్లో శారీరంగా వచ్చే మార్పులు, ఒత్తిడి, మొదలైనవి జీఈఆర్‌డీ కి గల కారణాలు.

లక్షణాలు
-ఛాతిలో మంట, గుండెలో మంటలా అనిపించడం
-గొంతు బొంగురుపోవడం - ఆమ్లాలు స్పింక్టర్ ద్వారా అన్నవాహికలోకి ప్రవేశించి, అక్కడ నుంచి గొంతుకు చేరడం వల్ల గొంతులో మంట, బొంగురుపోవడం వంటివి సంభవిస్తాయి.
-పుల్లటి తేన్పులు, వికారం, వాంతి, నోటి దుర్వాసన
-దీర్ఘకాలికమైన పొడిదగ్గు, చెవిలో నొప్పి
-గొంతులో ఏదో అడ్డం పడినట్లు ఉండడం వంటి లక్షణాలు కనబడతాయి.

నిర్ధారణ పరీక్షలు
-రోగి లక్షణాలతోనే దాదాపుగా నిర్ధారణ చేయవచ్చు. కొన్ని సందర్భాలలో నోటి ద్వారా కెమెరా గొట్టాన్ని పంపిచే ఎండోస్కోపీ పరీక్ష నిర్వహిస్తారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే ఇసిజి, ఛాతి ఎక్స్‌రే, హీమోగ్రామ్ వంటి పరీక్షలు చేయడం ద్వారా ఇతరత్రా సమస్యలేమన్నా ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
హోమియో చికిత్స
-హోమియోపతి వైద్యంలో అన్ని రకాల అసిడిటీ వ్యాధులను సమర్థవంతంగా నయం చేయవచ్చు. శారీరకంగా, మానసికంగా, జన్యుపరంగా రోగిని పరీక్షించిన తరువాత తదనుగుణంగా మందులు ఇస్తారు. ఈ విధంగా ఇచ్చిన మందులు మూల స్థాయిలో పనిచేస్తాయి. అంతేగాకుండా ఆమ్ల స్థాయిని తగ్గించి, పిహెచ్ స్థాయిల సమతుల్యతను కాపాడి, జీర్ణవ్యవస్థను యథాస్థితికి తీసుకొస్తారు. జీర్ణవ్యవస్థ అన్ని రకాల ఆహార పదార్థాలను తట్టుకునేలా ఈ మందులు దోహదపడతాయి.
srikanthm

1859
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles