అసలే ఉబ్బరం.. ఆపై ఇవెందుకు?


Mon,April 15, 2019 11:13 PM

ఇప్పటికే ఉబ్బరానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా చల్లని పదార్థాలు తీసుకోవడమే. అంతేకానీ.. ఆరోగ్యానికి మంచివని డాక్టరు చెప్పారని ఎక్కువగా తీసుకోవద్దు.. ఉబ్బరానికి మరింత ఊపిరిపోయొద్దు.
gastric
జంక్‌ఫుడ్ : తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు జంక్‌ఫుడ్ తినేస్తుంటారు. వీటిలో అధిక చక్కెరలు.. క్యాలరీలు ఉంటాయి. ఇవి లాభం కన్నా నష్టాన్నే ఎక్కువగా కలిగిస్తాయి. పెద్దపేగు సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఉబ్బరం కలిగిస్తుంది.

కాలిఫ్లవర్, బ్రోకలీ : క్రూసిఫెరస్ వర్గానికి చెందిన వీటిల్లో మనకు సరిపడేంత విటమిన్లు.. ఖనిజాలు ఉంటాయి. ఐతే ఇవి కొందరిలో కడుపులో గ్యాస్ సమస్యకు కారణం అవుతాయి. తేలికగా జీర్ణం కాకపోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది.

బీన్స్ : చిక్కుళ్లు లేదా బీన్స్‌లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం ఎంత వాస్తవమో.. జీర్ణం చేయలేని షార్ట్‌చైన్ కార్బోహైడ్రేట్స్ ఉండటమూ అంతే వాస్తవం. ఇవి పేగులలో ఎక్కువ సమయం ఉంటాయి. అది గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది. దీంతో కడుపు ఉబ్బరంగా ఉంటుంది. నానబెట్టిన బీన్స్‌ను వాడితే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

వెల్లుల్లి: ఇవి లేకుండా అసలు వంట చేసుకోలేని పరిస్థితి. రుచికి.. ఆరోగ్యానికీ ఇవి మంచివి. ఐతే ఇన్ఫ్లమేషన్ సమస్యలు ఉన్నవారికి అంత మంచివి కావు. ముడి ఉల్లిపాయలు, వెల్లుల్లిలో ఫ్రక్టోట్లు కలిగి ఉండి ఉబ్బరాన్ని కలిగించే సాల్యుబుల్ ఫైబర్లుగా పనిచేస్తాయి.

కాయధాన్యాలు: కందిపప్పు.. ముడి పెసర్లు.. ముడి శనగలు ఆరోగ్యకరమే అయినా ఇవి అందరికీ పడవు. కొందరిలో ఉబ్బరం సమస్యకు దారి తీస్తాయి. వీటిల్లో ఉండే షార్ట్‌చైన్ కార్బోహైడ్రేట్సే ఈ సమస్యకు కారణం.

గోధుమలు : గోధుమ పదార్థాలు తినకుండా ఉండలేం. తృణధాన్యాలు తినాలని డాక్టర్లే సూచిస్తారు. కానీ ఉదర కుహర సమస్య ఉన్నవారికి మాత్రం ఇవి మంచివి కావు. వీటిలో అధిక ఫైబర్ మూలాలు ఉండటం వల్ల జీర్ణం త్వరగా కావు. క్రమంగా గ్యాస్ సమస్యకు దారితీసి ఉబ్బరంగా అనిపిస్తుంది.

డైరీ ప్రోడక్ట్స్: పాలు, పాల పదార్థాలు తినకుండా మనం ఉండలేం. అయితే వాటిల్లో ఉండే లాక్టోజ్‌ను జీర్ణం చేసుకునే శక్తి తక్కువగా ఉంటుంది. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం, తిమ్మిర్లకు దారితీస్తుంది.

230
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles