అల్లంటీతో ఆస్తమాకు గుడ్‌బై


Wed,July 11, 2018 11:15 PM

అల్లం మసాలా దినుసు మాత్రమే కాదు, అల్లంతో అనేక ఉపయోగాలున్నాయి. అల్లంలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఒక కప్పు అల్లం టీని తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది.
ginger-tea
ఆస్తమా, దగ్గులకు చెక్ పెట్టాలంటే అల్లం టీ రోజూ తేనెతో కలిపి తీసుకోవాలి. అల్లం టీ వల్ల రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది. అల్లంలో ఉండే ఖనిజ లవణాలు గుండెకు మేలు చేస్తాయి. హృదయ కవాటాల్లో రక్త సరఫరా సక్రమంగా ఉండటానికి దోహదపడతాయి. హృద్రోగాలూ దూరంగా ఉంటాయి. నెలసరి సమస్యలూ అదుపులోకి వస్తాయి. టీ తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికశాతం అందుతాయి. రోగనిరోధక శక్తి పెరిగి, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఉండే అరోమా గుణాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి. అల్లం టీ ఉదయం తాగితే రోజంతా హుషారుగా ఉంచుతుంది. అల్లం టీని సేవించడం ద్వారా గర్భిణీలకు ఎంతో మేలు చేకూరుతుందట. వేవిళ్లకు చెక్ పెట్టడంలో అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. సాధారణ టీలో అల్లం బిస్కెట్లు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఛాతీలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం టీ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు దరిచేరవు. మోకాళ్ల వాపులు కూడా అల్లం టీ రోజూ తీసుకుంటే తగ్గిపోతాయి. అలాగే ఏ అనారోగ్యంతో బాధపడేవారు అల్లం టీని సేవిస్తే ఉపశమనం లభిస్తుంది. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధ పడేవారు అల్లం టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

2275
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles