అలా ఇంకెవ్వరూ బాధ పడకూడదని..!


Wed,August 1, 2018 01:42 AM

ఈమెకు తాతయ్యంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయనతో చాలా సన్నిహితత్వం ఉండేది. అయితే, ఒకరోజు క్యాన్సర్ వ్యాధితో ప్రేమగా చూసుకొనే తాతయ్య చనిపోయాడు. ఆ బాధను దిగమింగుతూ ఈ యువతి తీసుకున్న నిర్ణయం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నది.
DrDatta
మేఘాలయకు చెందిన 24 యేండ్ల ప్రియాంజలి దత్తాకు తాతయ్య అంటే చాలా ఇష్టం. ఆయన క్యాన్సర్‌తో చనిపోవడంతో.. ఆయనలా ఎవ్వరూ చనిపోకూడదని నిర్ణయించుకున్నది. పట్టుదలతో డాక్టర్ చదివి క్యాన్సర్ రోగుల పాలిట దేవత అయింది. ఆరోగ్య హెల్త్ కేర్ సెంటర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పేదలకు వైద్యం ఉచితంగా చేస్తున్నది. ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే.. దవాఖానకు వెళ్లి వైద్యం చేయించుకోలేని వాళ్లు, ముఖ్యంగా క్యాన్సర్ బారిని పడిన మహిళల దగ్గరకు వెళ్లి వైద్యం అందించడం. ఉత్తర, దక్షిణ రాష్ర్టాలలో ఎక్కువ మంది క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు తెలుసుకొని బృందాన్ని ఏర్పాటు చేసింది దత్తా. ఆ బృందం ప్రతిరోజూ ఒక్కో గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటుంది. బాధిత మహిళల వివరాలు తెలుసుకొని ఉచితంగా వైద్యం చేస్తూ, మందులు కూడా పంపిణీ చేస్తుంది దత్తా. ఇప్పటి వరకు ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తర రాష్ర్టాలు కలిపి మొత్తం ఐదులక్షల మంది మహిళలకు వైద్యం చేశారు. చాలామందిని క్యాన్సర్ మహమ్మారి నుంచి కాపాడారు. ఫ్యాషన్ రంగంపై ఆసక్తి ఉన్న దత్తా.. పలు ఫ్యాషన్ ఈవెంట్లు నిర్వహించేది, వాటిల్లో పాల్గొనేది కూడా. వాటి ద్వారా వచ్చిన డబ్బులను సంస్థకు ఖర్చు చేస్తున్నది. ఇలా మంచి ఉద్దేశంతో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నది డాక్టర్ ప్రియాంజలి దత్తా.

709
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles