అలసట తీర్చే బోర్డింగ్ గ్లాసెస్!


Sat,August 11, 2018 11:00 PM

ఏదైనా వస్తువును తదేకంగా చూసినా, పుస్తకాలు చదివినా కంటికి అలసట పెరిగి తలనొప్పి వస్తుంటుంది. కొంతమందికేమో ప్రయాణాలు చేసేటప్పుడు కళ్లు తిరగడంతో పాటు, వాంతులు అవుతుంటాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా కొత్తగా కళ్లద్దాలను కనుగొన్నారు తెలుసా పిల్లలూ!
sickness-glasses
విహారయాత్రలు అంటే ఇష్టం ఉండని వారుండరు. అయితే, కొంతమంది దూరప్రయాణాలంటే నిమ్మకాయ, యాలకులు వెంట తీసుకెళ్తారు. ఎందుకంటే ప్రయాణాలు పడక వాంతులు అవుతుంటాయి. ఇలా ఎన్నో ఆందాలను చూడకుండా.. సగమే ఆనందం పొందుతుంటారు. ఇంకొంతమందికి పుస్తకాలు చదువుతుంటే విపరీతంగా కళ్లు నొస్తుంటాయి. వీరందరినీ దృష్టిలో పెట్టుకొని జెన్నిస్ ఫాదర్ అనే వ్యక్తి బోర్డింగ్ గ్లాసెస్‌ను తయారు చేశారు. ప్రయాణించేటప్పుడు ఈ కళ్లజోడును పెట్టుకొంటే వాంతులు కాకుండా ఆపడమే కాకుండా, కళ్లు తిరగడం ఉండదు. అంతేకాదు, ప్రయాణించేటప్పుడు కొంతమంది వీడియోగేమ్స్ ఆడుతుంటారు. వారికి ఆట మీద నుంచి దృష్టి పక్కకు పోతుంటుంది. ఈ కళ్లజోడును పెట్టుకుంటే చూపు ఇతరుల మీదకు వెళ్లకుండా ఏకాగ్రతగా ఆడవచ్చు. విమానంలో వెళ్తున్నప్పుడు పైనుంచి కిందకి చూస్తే అన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. గ్లాసెస్‌ను పెట్టుకొంటే చిన్నవి కాస్తా పెద్దవిగా కనిపించి వింతకు గురి చేస్తుంటాయి. ఈ కళ్లజోడు మొత్తం నాలుగు అద్దాలను కలిగి ఉంటుంది. ఇవి ఎవరైనా ధరించవచ్చు. వీటివల్ల ఎటువంటి ప్రభావం ఉండదని బోర్డింగ్ గ్లాసెస్ సీఈఓ ఆంటోనీ జెన్నిన్ తెలిపారు. నాలుగు అద్దాలు ఉండడం వల్ల పక్కన ఉన్నవాటిని ప్రతిసారి తిరిగి చూడనవసరంలేదు.

392
Tags

More News

VIRAL NEWS

Featured Articles