అలర్జీకి హోమియో చికిత్స


Wed,August 10, 2016 01:24 AM

మన ఆరోగ్య సమస్యల్లో ప్రతిరోజూ మన జీవనశైలికి సవాలు విసురుతుంది అలర్జీ. మనిషి శరీర తత్వం, వాతావరణం, వంశపారంపర్య చరిత్ర, గాలి, నీరు, ఆహారంలలో కలిగే మార్పులు, కాలుష్యం, మన రక్తంలో జరిగే మార్పుల వల్ల ఈ అలర్జీ వస్తుంది. కొందరికి కొన్ని పదార్థాలు, కొన్ని వస్తువులు అలర్జీ కారకాలుగా ఉంటాయి. జన్యుసంబంధమైన కారణాలు తీసుకుంటే, ఒకే రకంగా ఉన్న కవలల్లో అలర్జీ ఉంటే 70 శాతం వరకు ఒకే రకంగా కాకుండా 30 శాతం మాత్రమే వచ్చే అవకాశం ఉంది. మన ఆధునిక జీవనం, పారిశ్రామిక ప్రాంతాల్లో, పెద్ద పట్టణాల్లో వాతావరణ కాలుష్యం ఎక్కువ. అందుకే అలర్జీలూ ఎక్కువే. మన శరీరంలో అలర్జీకి సంబంధించి చర్మం, ఊపిరితిత్తులు, జీర్ణకోశ వ్యవస్థ భాగాల్లో వీటి ప్రభావం ఎక్కువ. అలర్జీ ఉందని తెలిశాక దాన్ని నివారించడానికి మన జీవన విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

అలర్జీ అంటే శరీర వ్యాధి నియంత్రణ శక్తి అసందర్భ ప్రతిచర్య. మామూలుగా ఇతరుల్లో ఎటువంటి చర్యలుండవు. అలర్జీని ఉత్పత్తి చేసే పదార్థాలను అలర్జెన్స్ అంటారు. అవి పుప్పొడి, ఫంగస్, జంతు సంబంధ పదార్థాలు, పాలు, గుడ్డు, ఇతర ఆహార పదార్థాలు, రసాయనాలు, మందులు, దుమ్ము, ధూళి వంటివి.

అలర్జీ వచ్చినప్పుడు శరీరంలో జరిగే ప్రతీకార చర్య


అలర్జీ రాగానే శరీరంలో ప్రత్యేకమైన యాంటి బాడీ IgE విడుదలవుతుంది. ఇది అలర్జెన్‌కు అతుక్కుంటుంది. యాంటీబాడీస్‌ను రక్తంలోని మాస్ట్‌సెల్స్ పట్టివేస్తాయి. ఈ మాస్ట్ సెల్స్ శ్వాసకోశంలో, అన్నవాహికలో, జీర్ణమార్గంలో, ఇతర భాగాల్లో ఉంటాయి. అందువల్ల శ్వాసకోశం, జీర్ణఖోశంలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువ. అలర్జెన్స్ వల్ల యాంటిబాడీ తయారవుతుంది. ఈ యాంటీబాడీస్‌ను మాస్ట్ సెల్స్ పట్టివేసినప్పుడు హిస్టమిన్ అనే పదార్థం విడుదలవుతుంది. అలర్జీ సమస్యలకు ఈ హిస్టమినే కారణం.
అలర్జెన్ గాలిలో ఉంటే కన్ను, ముక్కులో దురద, ఊపిరితిత్తుల బాధలు ఉంటాయి. అలర్జెన్ జీర్ణాశయంలో ఉంటే నోరు, కడుపు, పేగుల బాధలు వస్తాయి. శరీరంలో దురదలు, దద్దుర్లు, బీపీ తగ్గిపోవడం, షాక్, సొమ్మసిల్లిపోవడం జరగవచ్చు.

అలర్జీ లక్షణాలు


అలర్జీ తీవ్రతను బట్టి మామూలు, ఎక్కువ, అతి ఎక్కువ అని మూడు రకాలు.

-మామూలు రకం :

ఏ భాగానికి చెందిన అలర్జీ అయితే సమస్యలు అక్కడే ఉంటాయి. కళ్లు దురద, ఎర్రబడడం, నీరు కారడం మొదలై తరువాత ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.

-ఎక్కువ :

కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తుంది. ఆయాసం, ఒళ్లంతా దురద ఉండొచ్చు.

-అతి ఎక్కువ :

దీన్నే అనఫలాక్సిస్ చర్య అంటారు. ఇవి చాలా తక్కువ. కాని తీవ్ర పరిణామం ఉంటుంది. వెంటనే స్పృహ కోల్పోతారు. కళ్లు, ఒళ్లు దురద, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, కొంకర్లు పోవడం, వాపులు, శ్వాసలో ఇబ్బందులు, తల తిరగడం, బీపీ, నాడీ వేగం తగ్గడం కనిపిస్తుంది. ఒక్కోసారి ప్రాణం కూడా పోవొచ్చు.

అలర్జీ అందరికీ ఉంటుందా?


muraliankireddy
తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వంశపారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రులిద్దరికీ ఉంటే 75 శాతం పిల్లల్లో కూడా అలర్జీ రావొచ్చు. ఒక్కరికే ఉంటే 50 శాతం అవకాశం ఉంటుంది.

హోమియో చికిత్స


హోమియోపతిలో అలర్జీకి అద్భుతమైన చికిత్స ఉంది. అలర్జీ ఏ కారణం వల్ల వస్తుంది, ఎంత తీవ్రంగా ఉంది, తీవ్రత ఎంత అనే అంశాలను బట్టి మందులు ఉంటాయి. ఆర్సెనిక్ ఆల్బ్, అర్టికయురిన్స్, రస్టాక్స్, ఆరమ్‌డైపిలమ్, అలియంసేప, ఇప్రెసియ, బెల్లడోనా, నేట్రంమూర్, ఇంకా చాలా మందులు కారణాన్ని బట్టి ఇవ్వబడతాయి.

1934
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles