అర్థం- పరమార్థం


Fri,September 7, 2018 01:04 AM

ఏకమిషే విష్ణుస్తాన్వేతు
ద్వే ఊర్జే విష్ణుస్తాన్వేతు
త్రీరావివ్రతాయ విష్ణుస్తాన్వేతు
చతుర్విమయోభవాయ విష్ణుస్తాన్వేతు
పంచపశుభ్యో విష్ణుస్తాన్వేతు
షడ్రుతుభ్యో విష్ణుస్తాన్వేతు
సప్తహోత్రభ్యో విష్ణుస్తాన్వేతు.

Artham--Paramartham
నూతన దంపతుల భావి జీవితానికి నాంది సప్తపది. అగ్నిసాక్షిగా వారితో తూర్పువైపు ఏడడుగులు నడిపిస్తూ చదివే ఈ మంత్రాల పరమార్థం వారి దాంపత్యానికి కావలసిన సమగ్ర సుఖజీవనాన్ని కాంక్షించేది. దీనితోనే వధువు స్వగోత్రం లోంచి వరుని గోత్రంలోకి మారుతుంది. నువు నా వెనుక నడువు. నువు వేసే తొలి అడుగువల్ల అన్నాన్ని, రెండో అడుగుతో బలాన్ని, మూడవ అడుగుతో మంచి పనులను, నాలుగో అ డుగుతో సౌఖ్యాన్ని, అయిదో అ డుగుతో పశుసమృద్ధిని, అరవ అడుగుతో ఋతుసంపదను, ఏడవ అడుగువల్ల ఏడుగురు హోతలను ఆ విష్ణుమూర్తి నీకు ప్రసాదించునుగాక అని పురోహితుడు వరునితో చెప్పిస్తాడు.

984
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles