అరటిపండులోని విటమిన్లు, శరీరానికి మేలు


Fri,August 10, 2018 12:52 AM

Banana-Face
-అరటిపండులోని విటమిన్లు, మినరల్స్ మనిషి శరీరానికి మేలు చేస్తాయి. అరటిపండులో జీర్ణశక్తిని పెంపొందించే లక్షణం ఉన్నది.
-జుట్టుకు మంచి సంరక్షణ కల్పిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలోని విటమిన్ ఎ చర్మ సంబంధమైన వ్యాధులు రాకుండా నిరోధించగలిగే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
-సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాల వల్ల చర్మానికి కలిగే నష్టం నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా శరీరంలోని ముడుతలను తగ్గిస్తుంది.
-ఇందులోని హైడ్రేటింగ్ ఏజెంట్లు మాడును తేమగా ఉంచడంలో సహాయపడుతాయి. దానివల్ల ఒత్తైన, మృదువైన, ఆరోగ్యవంతమైన జుట్టును పొందవచ్చు.

243
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles