అమ్మకాల్లో అదే జోరు


Fri,September 7, 2018 11:18 PM

villa
తెలంగాణలో ఎన్నికలు వచ్చినంత మాత్రాన రియల్ రంగంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని.. ప్రస్తుతమున్న వాణిజ్య సముదాయాలను దృష్టిలో పెట్టుకుంటే.. మరో మూడు నుంచి నాలుగేండ్ల దాకా హైదరాబాద్ నిర్మాణ రంగంలో డిమాండ్ ఉంటుందని రాంకీ గ్రూప్ ఎండీ నందకిశోర్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాదిలో రెండు ప్రాజెక్టులను కొనుగోలుదారులకు అందజేస్తున్న సందర్భంగా నమస్తే సంపదతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సారాంశం ఆయన మాటల్లోనే..

ఆర్థికంగా మంచి ప్రగతి సాధిస్తే.. రియల్ రంగం చివర్లో అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక అభివృద్ధి నిలిచిపోతే.. ముందుగా కుప్పకూలేది రియల్ రంగమే

రానున్న ఎన్నికల్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రజలకు తెలుసు. అందుకే, ఇండ్ల లావాదేవీలు ఎప్పటిలాగే జరుగుతాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మార్కెట్ మరిం త ఊపులో ఉంటుంది కాబట్టి.. ఇండ్ల కొనుగోలుదారులు సొంతింటి ఎంపికకు తుది నిర్ణయం తీసుకోవడానికిదే సరైన సమయం. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ.. ఇండ్ల అమ్మకాలు, కొనుగోళ్లు క్రమం తప్పకుండా జరుగుతాయి. హంగ్ వచ్చినప్పుడో లేదా రాజకీయ అనిశ్చితి నెలకొన్నప్పుడే ప్రజలు ఇండ్లు కొనడానికి కాస్త వెనకడుగు వేస్తారు. అయితే, ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇలాంటి సమస్యేం లేదు. గత కొంతకాలం నుంచి హైదరాబాద్ రియల్ రంగంలో ఎక్కడ్లేని గిరాకీ పెరిగింది. ఇక్కడ ప్రతిఒక్కరూ ఒక ముఖ్యమై విషయాన్ని గమనించాలి. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు.. నిర్మాణ రంగమే చివర్లో పుంజుకుంటుంది. ఆర్థిక ప్రగతి నిలిచిపోతే, ముందుగా పడిపోయేది రియల్ రంగమే. మన అదృష్టం ఏమిటంటే.. గత రెండేండ్ల నుంచి వాణిజ్య రియల్ రంగానికి మంచి గిరాకీ ఉంది. ఇప్పటివరకూ వివిధ సంస్థలు తీసుకున్న వాణిజ్య స్థలాల్లోకి ఐటీ కంపెనీలు కార్యకలాపాల్ని ప్రారంభించడానికి ఒకట్రెండేండ్లు అయినా పడుతుంది. అందులోకి ఉద్యోగులను నియమించుకుని.. పూర్తి స్థాయి కార్యకలాపాలను మొదలు పెట్టిన తర్వాత కూడా నివాస సముదాయాలకు గిరాకీ పెరుగుతుంది. ఎలా చూసినా, వచ్చే నాలుగేండ్ల దాకా రియల్ రంగం స్థిరంగా ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి ఢోకా లేదు.
ramki
ప్రస్తుతం హైదరాబాద్‌లో యా భై లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నాం. గెలాక్సియా, ట్రాంక్విలాస్, మా ర్వెల్, గార్డెనియా గ్రోవ్ అనే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. వీటిలో గార్డెనియా గ్రోవ్‌ను ప్రస్తుతం కొనుగోలుదారులకు అప్పగిస్తున్నాం. మార్వెల్‌ను ఈ ఏడాదే బయ్యర్లకు అందజేస్తాం. గెలాక్సీయ, ట్రాంక్విలాస్ వచ్చే ఏడాదిలో అప్పగిస్తాం. చన్నైలో మూడు ప్రాజెక్టులు, బెంగళూరులోని ఎలహంక వద్ద మరో ప్రాజెక్టును చేపడుతున్నాం. మూడు నగరాలను కలుపుకుంటే దాదాపు 65 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నాం. రానున్న రోజుల్లో మరో నలభై లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికల్ని రచిస్తున్నాం. హైదరాబాద్‌లో కొత్తగా మూడు ప్రాజెక్టులు, బెంగళూరు, చన్నైలో ఒక్కో నిర్మాణాన్ని నిర్మిస్తున్నాం.

228
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles