అన్నం అస్సలు తినను!


Wed,June 6, 2018 10:44 PM

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది అమైరా దస్తూర్. మనసుకు నచ్చిందితో తెరంగేట్రం చేసి రాజుగాడుతో సక్సెస్ హీరోయిన్ అనిపించుకుంది. మరి ఈ నటికి నచ్చిన ఆహారం ఏంటో చదువండి.
Amyra
హీరోయిన్ అయ్యాక డైట్ ఫాలో అవుతున్నా. కానీ నెలలో ఒకరోజు డైట్‌కి చెల్లు చీటీ ఇస్తా. అప్పుడు మాత్రం పిజ్జా లాగించేస్తా. అది కూడా బాంద్రాలోని రేస్ పిజ్జా కార్నర్‌లో. ఇది కాకుండా దాల్‌మఖ్‌నీ, చిల్లీ చీజ్ నాన్ ట్రై చేస్తా. వైట్ చాక్లెన్ ఫౌంటెయిన్‌ని మార్ష్‌మాల్లో డిప్ చేసి వాటికి బ్రౌనీ క్యూజ్‌లను యాడ్ చేసి తింటే ఆ టేస్టే వేరు. ఇక తమ్ముడు జహంగీర్ దస్తూర్ చెఫ్. నాకు కొత్త కొత్త వెరైటీలు చేసి పెడుతుంటాడు. అన్నీ టేస్ట్ చేస్తా. నేను కిచెన్‌లోకి అడుగుపెడితే కోడిగుడ్డు కూర మాత్రం చేస్తాను. ఎందుకంటే వేరేవి నాకు రావు. అమ్మ చేసే ధన్‌సాక్ చావల్ అంటే చాలా ఇష్టం. స్పైసీ, మసాలా దోశ, పావుబాజీ అంటే వెంటనే నాకు నోట్లో నీళ్లూరుతాయి. బాంద్రాలోని కిచెన్ గార్డెన్ హోటల్‌కి ఎక్కువగా వెళుతుంటాను. అన్నం, పాలు, ఉప్పునా డైట్‌లో అస్సలు చేర్చను. ఎగ్ వైట్, ఉల్లిపాయలు, టమాట, పచ్చిమిర్చి, మష్రూమ్స్‌ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటా. చేపలు, సలాడ్ మధ్యాహ్నం లంచ్. జవారోటీ, టోఫు కర్రీతో నా డిన్నర్ పూర్తవుతుంది. ఒకవేళ అది కుదురకపోతే బ్రౌన్ బ్రెడ్‌తో టమాటాసూప్, రెండు కోడిగుడ్లు తింటాను.

2085
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles