అధికబరువుకు సర్జరీయే బెస్ట్!

Mon,March 20, 2017 01:38 AM

faat
నా వయసు 27 సంవత్సరాలు. ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. నా బరువు 110 కిలోలు. వెయిట్ లాస్ కోసం విపరీతమైన ఎక్సర్‌సైజులు చేస్తున్నాను, కాని ఎలాంటి ఫలితం కనిపించట్లేదు. పెళ్లి సంబంధాలు రావడం లేదని, తిండి తగ్గించమని ఇంట్లో తెగ తిడుతున్నారు. కాని నేను మాత్రం తిండి విషయంలో కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. దీనికి సరైన పరిష్కారం ఏమన్నా ఉంటే తెలుపగలరు.
- విజయ్, వేములవాడ

faat2
మీ ఎత్తు, బరువులను దృష్టిలో పెట్టుకుని చూస్తే మీరు స్థూలకాయంతో బాధపడుతున్నారనే చెప్పవచ్చు. బిఎంఐ విలువల ద్వారా ఎవరు అధిక బరువుతో ఉన్నారనేది కొలుస్తారు. సాధారణం కన్నా కొద్దిపాటి లావు లేదా అధిక బరువు ఉన్నట్టయితే జంక్‌ఫుడ్ లాంటివి మానేయడం, ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినడం ద్వారా, వ్యాయామం చేస్తూ బరువును కట్టడి చేసుకోవడచ్చు. వయసు, ఎత్తుకు తగ్గట్టు కాకుండా అధిక బరువు కలిగివుండడాన్ని మార్బిడ్ ఒబేసిటీ అంటారు. ఇది ఒక జబ్బుగానే పరిగణించవచ్చు. దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలు కూడా ప్రభావితం అవుతాయి.

మార్బిడ్ ఒబేసిటీ మొదలైందంటే ఇక డయాబెటిస్, గుండెపోటు, బీపీ, నిద్రలేమి లాంటి అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. దీన్ని కేవలం వ్యాయామం, తిండి తగ్గించడం లాంటి వాటితో కంట్రోల్ చేయడం ఎంతమాత్రం సాధ్యం కాదు. ఇందుకు మీరు సురక్షితమైన, మేలైన బేరియాట్రిక్ సర్జరీని ఎంచుకోవడమే ఉత్తమ పరిష్కారం. ఈ సర్జరీ ద్వారా స్థూలకాయం వల్ల భవిష్యత్తులో రాబోయే అనారోగ్య సమస్యలను కూడా నివారించవచ్చు. చాలా చిన్నపాటి రంధ్రంతో ఈ సర్జరీని నిర్వహిస్తారు. దీనివల్ల శరీరం మీద ఎలాంటి గాటు లేదా గాయాలుండవు. ఈ అతిగా ఆకలికి గురిచేసే హార్మోన్ల పెరుగుదలను ఈ సర్జరీ ద్వారా నియంత్రించవచ్చు. ఈ సర్జరీ తరువాత ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు.

faat1
మూడు ప్రక్రియల్లో దీన్ని నిర్వహిస్తారు. మొదట కడుపులోని కొద్ది భాగాన్ని లాప్ బ్యాండ్ అనే చిన్న పౌచ్‌తో చుడతారు. దీనివల్ల ఆహారం తక్కువగా తింటారు. తద్వారా కేలరీల స్థాయి తగ్గుతుంది. లాప్‌స్లీవ్ గ్యాస్ట్రెక్టమీతో జీర్ణాశయాన్ని అరటి ఆకారంలోకి తీర్చి దిద్దుతారు. తద్వారా దాని పరిమాణం తగ్గుతుంది. ఇక ఆఖరి ప్రక్రియ లాప్ గ్యాస్ట్రిక్ బైపాస్. దీని ద్వారా చిన్న పేగును మొదటి ప్రక్రియలోని పౌచ్‌తో అనుసంధానిస్తారు. దీనివల్ల మనం ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని అనుకున్నప్పటికీ కడుపు పరిమాణం చిన్నగా ఉండడంతో సాధ్యం కాదు. ఈ బేరియాట్రిక్ సర్జరీ సురక్షితమైనది. దుష్ప్రభావాలుండవు.

785
Tags

More News

మరిన్ని వార్తలు...