అదరహో.. ఆర్కిటెక్చర్!


Thu,August 23, 2018 12:40 AM

doshiబాలకృష్ణ విఠల్‌దాస్ దోషీ ఉరఫ్ దోషీగా సుపరిచితుడు.. ఆర్కిటెక్చర్ విభాగంలో దశాబ్దాల కాలంగా నిష్ణాతుడు.. ఆయనను ప్రతిష్టాత్మకమైన ప్రిట్జాకర్ ప్రైజ్ వరించింది.. అంటే ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ ప్రైజ్‌తో సమానం.. దోషీ చేపట్టిన ప్రతీ ప్రాజెక్ట్ ఒక అద్భుతం.. తక్కువ ఖర్చుతో.. అందమైన భవంతులు నిర్మించడంలో సిద్ధహస్తుడు.. అందుకే ఆయన ఆ అవార్డుకు అర్హుడయ్యాడు.. ఆయన నిర్మించిన కొన్ని భవనాల గురించే ఈ కథనం..


అమ్‌దావాద్ నీ గుహ

amdavad-ni-gufa
మక్బుల్ ఫిదా హుస్సేన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఎం.ఎఫ్.హుస్సేన్ అంటే మాత్రం మంచి చిత్రకారుడని చెప్పేస్తారు. ఆయన పెయింటింగ్స్ పెట్టడానికి బాలకృష్ణ విఠల్‌దాస్ దోషీ ఈ డిజైన్‌ని రూపొందించాడు. అహ్మదాబాద్‌లో కొలువై ఉన్న ఈ ఆర్ట్‌గ్యాలరీ అండర్ గ్రౌండ్‌లో ఉంటుంది. దీన్ని మొజాయిక్ టైల్స్‌తో కట్టారు. దాంతో ఎండ పడినప్పుడు లోపలకు కాంతి తక్కువగా వస్తుంది. పైగా గుహ పైన మొత్తం మెరుస్తుంటుంది. అచ్చు తాబేలు పైభాగాన్ని పోలినట్లుగా దీన్ని నిర్మించారు. పైగా చాలావరకు వేస్ట్ మెటీరియల్‌తోనే దీని నిర్మాణం జరిగింది. మొదట దీన్ని హుస్సేన్ దోషీనీ గుహ అని పేరు పెట్టారు. ఆ తర్వాత స్థల నిర్ణయం అయ్యాక పేరు మార్చారు.


ఐఐఎమ్ బెంగళూరు

IIM-Bangalore-campus
ఐకాన్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లుగా ఐఐఎమ్‌లకి పేరు. అహ్మదాబాద్, కలకత్తా తర్వాత మూడవ క్యాంపస్‌గా వెలిసింది ఐఐఎమ్ బెంగళూరు. బన్నెర్‌గట్టా రోడ్‌లో 1983లో ఈ క్యాంపస్ స్థాపించారు. ఈ క్యాంపస్ 100 ఎకరాల్లో రాళ్లతో, చెక్కతో నిర్మించారు. ఫతేపూర్ సిక్రీ పట్టణ రూపకల్పన ఆధారంగా ఈ ఇనిస్టిట్యూట్ రూపొందింది. ఎక్కువగా కారిడార్లు, కొన్ని చోట్ల ఓపెన్ ఏరియా ఉంటుంది. దీనివల్ల బయట వాతావరణం లోపలకు వచ్చేందుకు అనువుగా మారుతుంది. తరగతిలో కూర్చున విద్యార్థులు, అధ్యాపకులు కూడా ప్రకృతిని ఆస్వాదించేలాగా ఈ క్యాంపస్ నిర్మాణం చేశారు. విశాలంగా ఉండే తరగతి గదులు కూడా ఈ క్యాంపస్‌కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.


అర్యనా టౌన్‌షిప్

Aranya-Township
పేదలకు ఇండ్లు కట్టించడమంటే ఆషామాషీ కాదు. దాన్ని దోషీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. 86 హెక్టార్లలో 6,500 ఇండ్లను కట్టాడు. పైగా ఇంటి రంగులన్నింటిలోనూ శ్రద్ధ తీసుకున్నాడు. ఈ ఇండ్ల మధ్యలో వచ్చే వీధులు కూడా కాస్త పాత వీధులను తలపించేలా చతురస్రాకారంలో ఉండేలా డిజైన్ చేశాడు. చిన్నచిన్న గదుల్లాగా ఉండే ఈ నిర్మాణం చాలా ఆహ్లాదంగా కూడా ఉంటుంది. 80వేల మంది ఈ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్నారు.


సంగత్ ఆర్కిటెక్చర్ స్టూడియో

Sangath-Architectural-Studi
దోషీ సొంత స్టూడియో ఇది. అందుకే ఇది అన్నిటిలో కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఏ భవంతికైనా పై భాగం సమాంతరంగా ఉంటుంది. కానీ దీనికి మాత్రం గిన్నె బోర్లించినట్టుగా ఉంటుంది. దీనికి కింది భాగంలో వర్షం నీరు సేవ్ చేసుకోవడానికి వీలుగా ఇలా కట్టినట్లు దోషీ చెబుతున్నారు. ముందుభాగంలో గార్డెన్ మనసును ఆహ్లాదపరుస్తుంది. గోడలు కూడా ప్రత్యేకంగా, వెలుతురు గదుల్లోకి పడేవిధంగా ఈ నిర్మాణాన్ని చేపట్టాడు. గుహలాగా ఉండే ఈ నిర్మాణంలో ఇంటీరియర్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ నిర్మాణాన్ని చేశాడు దోషీ.


ఠాగూర్ మెమొరియల్ హాల్

Tagore-Memorial-Hall
ఆర్కిటెక్చర్‌లో కొత్త పుంతలు మొదలైంది 1951లో. 1966లోనే దీన్ని అమలు చేశాడు దోషీ. ఠాగూర్ మెమొరీయల్ హాల్ పేరు మీద అహ్మదాబాద్‌లో ఈ నిర్మాణం జరిగింది. కాంక్రీట్‌తో చేసిన ఈ హాల్ నిర్మాణం ప్లేట్లను పేర్చిన మాదిరిగా కనిపిస్తుంది. 700మంది కూర్చునే విధంగా ఈ హాల్‌ని నిర్మించారు. సబర్మతి నది పక్కన ఉన్న ఈ హాల్ మీద ఠాగూర్ బొమ్మ మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక వీటి పొడవు, మందం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. లాబీ ఏరియా దీనికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

586
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles