అత్యంత పరిశుభ్రం.. ఈ సరస్సు


Fri,July 27, 2018 12:55 AM

ప్రపంచంలో అనేక సరస్సులున్నాయి. కానీ న్యూజిలాండ్‌లో బ్లూ లేక్ (నీలం రంగు సరస్సు) చాలా ప్రత్యేకమైంది. అద్భుతమైంది. ఇంతకీ ఆ సరస్సుకు సంబంధించిన విశేషాలేమిటంటే..
clearestlake
న్యూజిలాండ్‌లోని మౌంట్ ఫ్రాంక్లిన్‌కు సమీపంలో ఉంటుందీ సరస్సు. న్యూజిలాండ్ సౌత్ ఐస్‌ల్యాండ్‌లో ఉన్న ఈ సరస్సు ప్రపంచంలోనే పరిశుభ్రమైందిగా గుర్తింపు పొందింది. అంతే కాదు స్థానిక ప్రజలు, ప్రభుత్వం దీనిని ఒక పవిత్రమైన ప్రదేశంగానూ భావిస్తారు. ఇందులోని నీరు ఎంత చల్లగా ఉంటుందంటే, ఒక వెట్‌సూట్ ధరించకుండా అడుగు పెట్టలేనంత. సరస్సు అందాలను కెమెరాల్లో బంధించకుండా ఉండలేరు. ఈ సరస్సులో కనిపించే అద్భుతమైన దృశ్యాల్లో ఒకటి.. నీటిపై పరావర్తనం చెందే రకరకాల రంగులు. చూపరులను కనులవిందు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సరస్సులో ఈత కొట్టడం నిషేధం. ఈ సరస్సులోని నీటి నాణ్యతను సంరక్షించేందుకు సందర్శకులకు ప్రవేశం లేదు. దూరం నుంచి మాత్రమే ఈ ప్రకృతి అందాల్ని కనులారా ఆస్వాదించాలి. ఉపరితలం నుంచి 260 అడుగులు (80 మీటర్ల) లోతువరకు నీటిలో ఏమున్నదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దీని అడుగుభాగం ఒక అద్భుతాన్ని తలపిస్తుంది. పచ్చదనం పరుచుకున్నట్టుగా ఉంటుంది. రకరకాల మొక్కలతో దర్శనమిస్తుంది. అందుకే ఈ నీటికి ఇంతటి పవిత్రత వచ్చిందని స్థానికులు చెబుతారు. కాగా, ఈ సరస్సుకు వరల్డ్ క్లియరెస్ట్ లేక్‌గా గుర్తింపు వచ్చింది.

750
Tags

More News

VIRAL NEWS

Featured Articles