అతి వ్యాయామంతో వంధ్యత్వం


Mon,January 28, 2019 11:40 PM

Exersise
అతి ఏదైనా అనర్థమే. ప్రతీది ఒక లెక్క ప్రకారం చేస్తే ఏ సమస్యా ఉండదు. వ్యాయామం కూడా అలాంటిదే. వ్యాయామం శరీరానికి.. ఆరోగ్యానికి అత్యవసరం. కానీ.. అతి అవసరం కాదనే విషయం తెలుసుకుంటే సంతానోత్పత్తి సమస్యలు ఏర్పడవు. ఎవరైనా వ్యాయామం చేయమంటారు కానీ.. ఆలోచించి చేయండి అని చెప్పడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ ఇది వాస్తవం. అతిగా తింటే అజీర్తి అయినట్లు.. అతిగా వ్యాయామం చేస్తే అది శరీరానికి ముప్పే. దీని నుంచి ఎలా బయటపడాలి? ఆరోగ్యవంతమైన జీవితం కోసం.. సంతానం సాఫల్యం కావడం కోసం ఎలా వ్యాయామం చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం.


సిఫారసు చేసినంతనే..

శరీరానికి వ్యాయామం అనేది ఒక వరం లాంటిది. దానివల్ల శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. కానీ ఆధునిక జీవన విధానంలో రోజూ జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసే సమయం చాలామందికి ఉండడం లేదు. దీనివల్ల శరీరానికి ఇప్పుడు కాకపోయినా భవిష్యత్‌లో చాలా నష్టాలు జరుగుతాయి. ఇది గ్రహించినవాళ్లు ముందు జాగ్రత్తగా విపరీత వ్యాయామం చేస్తున్నారు. కానీ అతి వ్యాయామం మహిళలకు హానికరం అనే విషయం తెలుసుకోవాలి. సిఫార్సు చేసినదానికన్నా ఎక్కువ వ్యాయామం చేస్తే స్త్రీలలోనే కాదు.. పురుషుల్లో కూడా వంధ్వత్వం ఏర్పడుతుంది.


క్రమపద్ధతిలో వ్యాయామం

వ్యాయామం ఆరోగ్యానికి మంచిది. దానిని ఒక లెక్క ప్రకారం చేయాలి. సమయం దొరికింది కదా అని ఎడాపెడా కాకుండా క్రమపద్ధతితో వ్యాయామం చేస్తే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అవేంటంటే..


గుండె స్థితి మెరుగు పడుతుంది

మనం చేసే శారీరక శ్రమపైనే గుండె స్థితి ఆధారపడి ఉంటుంది. వ్యాయామం చేసేవారితో పోలిస్తే చెయ్యనివారిలోనే గుండె సమస్యలు ఉన్నట్లు తేలింది.


మంచి నిద్ర పడుతుంది

వ్యాయామం చేస్తే రాత్రిపూట మంచి నిద్ర పడుతుందని అధ్యయనాలలో తేలింది. వ్యాయామం వల్ల పగటిపూట కండరాలు బిగుసుకొని రాత్రిపూట మంచి నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది.


శక్తి అధికమవుతుంది

మనందరికీ ఉన్న అపోహ ఏమిటంటే వ్యాయామం చెయ్యడం వల్ల శక్తి నశిస్తుందని. కానీ దానికి పూర్తి వ్యతిరేక క్రియ శరీరంలో జరుగుతుంది. వ్యాయామం చెయ్యడం వల్ల ఒక ప్రత్యేక హార్మోన్ శరీరంలోకి విడుదలవుతుంది.


ఇవీ అనర్థాలు!

రుతుక్రమ లేమి

ఆడవారిలో ఎమినోర్హియా (రుతుక్రమ లేమి) అనేది సహజం. సాధారణ స్త్రీకీ మూడు నెలల కన్నా ఎక్కువ సమయం పాటు రుతుక్రమం రాకపోతే ఈ సమస్య వస్తుంది. ఒక రోజులో 3-4 వ్యాయామ సెషన్లు చేయడం వల్ల శరీరానికి కావలసిన కేలరీలు అందక ఈ స్థితి ఏర్పడుతుంది.


లైంగిక కోరికలు తగ్గిపోవడం

శరీరానికి సరిపడా కేలరీలు అతి వ్యాయామం వల్ల తగ్గిపోతాయి. కానీ ఇవి స్త్రీలలో లేనిపోని సమస్యలను సృష్టిస్తాయి. ముఖ్యంగా లైంగికసమస్యలు ఏర్పడతాయి, కోరికలు తగ్గిపోతాయి. ఫలితంగా వంధ్యత్వం ఏర్పడుతుంది.


ఈస్ట్రోజన్ మార్పులు

వంధ్యత్వం ఏర్పడటంలో ఊబకాయం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. చాలామంది ఊబకాయ స్త్రీలు కొంతబరువు తగ్గాలని అతిగా వ్యాయామం చేస్తుంటారు. దీనివల్ల ఈస్ట్రోజన్ స్థాయి పెరిగిపోతుంది. అండం విడుదలవదు. రుతుక్రమ సమస్యలు ఏర్పడతాయి. తద్వారా వంధ్యత్వం ఏర్పడుతుంది. కొంతమంది యుక్తవయసులో ఉన్నవారికి ఈస్ట్రోజన్ స్థాయి తక్కువుంటుంది. దీనివల్ల కూడా గర్భధారణ సమస్యలు తలెత్తుతాయి.


వీర్యకణ కౌంట్ తగ్గిపోవడం

పురుషులు అతిగా వ్యాయామం చేయడం వల్ల వీర్యకణ కౌంట్ తగ్గిపోతుంది. శరీరాన్ని తగిన ఆకృతిలో ఉంచుకోవడానికి పురుషులు అతిగా వ్యాయామం చేస్తుంటారు. కొందరైతే ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటారు. వీటివల్ల వీర్యకణ కౌంట్ తగ్గి వంధ్యత్వం ఏర్పడుతుంది. టెస్టోస్టిరాన్ ఉత్పత్తి ఎక్కువై ఇతర హార్మోన్లపై కూడా చెడు ప్రభావం పడి సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి. పొగతాగడం, మద్యపానం వల్ల కూడా సంతానోత్పత్తి మందగిస్తుంది.
Dr.-Swati-chaurasia
డాక్టర్
స్వాతి చౌరాసియ
ఐవీఎఫ్ నిపుణురాలు
ఇందిర ఐవీఎఫ్
హాస్పిటల్, హైదరాబాద్

267
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles