అడినాయిడ్స్‌కు సర్జరీ తప్పనిసరా?!


Sat,June 17, 2017 12:18 AM

మా పాప వయసు 3 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉన్న పాపాయే. కానీ ఈ మధ్య ఒక సంవత్సర కాలంగా తనకు తరచుగా జలుబు చేస్తోంది. చేసిన ప్రతిసారీ చెవిలో నొప్పి కూడా వస్తోంది. ఇలా ఈ సంవత్సర కాలంలో దాదాపు 5,6 సార్లు జరిగింది. చెవి నొప్పి వచ్చిన ప్రతిసారీ డాక్టర్ ఇచ్చిన మందులతో జలుబు, చెవి నొప్పి రెండూ తగ్గిపోతున్నాయి. కానీ ఈ మధ్య ఈఎన్‌టీ డాక్టర్‌కి చూపించినపుడు ఆయన పాపకు అడినాయిడ్స్ పెరిగిపోయాయి సర్జరీ అవసరమవుతుంది అని చెప్పారు. కానీ సన్నిహితులు చాలా మంది పాపాయికి 7, 8 సంవత్సరాలు వచ్చేసరికి అవే తగ్గిపోతాయి. సర్జరీ అనవసరం అని అంటున్నారు. మాకు ఎం చెయ్యాలో పాలుపోవడం లేదు. సరైన సలహా ఇవ్వగలరు.
sickchild

దమయంతి, కోదాడ

పసిపిల్లల్లో సాధారణంగా నిరోధక శక్తి కాస్త తక్కువగా ఉండడం మూలంగా చాలా త్వరగా జలుబు, దగ్గు వంటి చిన్నచిన్న ఇన్‌ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. అయితే కొంత మంది పిల్లల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం వారిలో అలర్జీ కలిగించే లక్షణం ఎక్కువగా ఉండడం. ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉన్నపుడు అది చెవి వరకు వ్యాపిస్తుంది. అలాంటి సందర్భాల్లో పిల్లల చెవిలో నొప్పి రావడం, ఒక్కోసారి చీము రావడం కూడా ఉండవచ్చు. ఇలాంటి వారికి అలర్జీ తగ్గించే మందులు ఇస్తే సరిపోతుంది.
dhurgaprasad
వారిలో అలర్జీ తగ్గిపోయి క్రమంగా లక్షణాలు తగ్గిపోతాయి. అయితే ఒక్కోసారి ఈ ఇన్‌ఫెక్షన్ ముక్కు వెనుక భాగంలో ఉన్న అడినాయిడ్స్, గోంతులో ఉన్న టాన్సిల్స్ వరకు కూడా వ్యాపించవచ్చు. ఇలా వ్యాపించినపుడు అడినాయిడ్స్, టాన్సిల్స్‌లో వాపు వస్తుంది. ఫలితంగా పిల్లల్లో తరచుగా జ్వరం రావడం, బరువు పెరగకపోవడం, ఆకలి సరిగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారికి ఈఎన్‌టీ సర్జన్‌లు చిన్న సర్జరీ ద్వారా ఇన్‌ఫెక్షన్ సోకిన అడినాయిడ్స్, టాన్సిల్స్ తొలగిస్తారు. నిజానికి ఒకసారి ఇన్‌ఫెక్షన్ సోకి సర్జరీ అని డాక్టర్ చెప్పినపుడు వీలైనంత త్వరగా మీరు పాపాయికి సర్జరీ చేయించడం మంచిది. ఎందుకంటే అది దానంతట అదే తగ్గిపోయేది కాదు. కాబట్టి వెంటనే సర్జరీకి ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.

317
Tags

More News

VIRAL NEWS