అటు సంప్రదాయం ఇటు ఆధునికం


Thu,December 6, 2018 11:46 PM

సొగసుగా.. సౌకర్యంగా ఉండే చీరలు.. స్టయిల్‌గా.. ఫ్యాషన్‌గా ఉండే గౌనులు.. ఎలాంటి అకేషన్లలోనైనా ప్రత్యేకంగా కనిపిస్తాయి.. పట్టు.. ఫ్యాన్సీ.. ఎలాంటి ఫ్యాబ్రిక్‌లైనా..
మీ మనసులను వల వేసి లాగుతాయి.. ఆడవాళ్లకు ప్రత్యేకమైన ఆ కలెక్షన్ మీకోసం..

fashion
లేత రంగులు ఎవరికైనా బాగా నప్పుతాయి. లేత ఆకుపచ్చ రంగు ఉన్న నెట్ చీర ఇది. దీని మీద ఫుల్‌గా గోల్డ్, సిల్వర్ జర్దోసీ వర్క్ నింపేశారు. స్టోన్ వర్క్ చీర అందాన్ని రెట్టింపు చేసింది. ఇదే వర్క్ బ్లౌజ్ మీద కూడా కంటిన్యూ అయింది.

fashion2
బ్లూ కలర్ సీక్వెన్స్ వర్క్ మెటీరియల్‌ని స్టెప్‌లుగా గౌన్‌ని డిజైన్ చేశారు. దాని మీద నెట్‌ఫ్యాభ్రిక్ రావడంతో మరింత అందంగా మెరిసిపోతున్నది. నెక్ లైన్ దగ్గర వచ్చిన వర్క్, పైప్ వర్క్ ైస్టెలిష్ లుక్ తెచ్చి పెట్టింది.

fashion3
ఎర్రని ప్లెయిన్ సిల్క్ చీర ఇది. దీనికి మ్యాచింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. దాన్ని కాస్త డిఫరెంట్‌గా చూపించడానికి సిల్వర్ ట్యూబ్‌లతో కేప్‌లా ఇవ్వడంతో సూపర్‌గా ఉంది. డిఫరెంట్ లుక్‌తో మెరిసేందుకు ఇలా రెడీ అవ్వాల్సిందే!

fashion4
రాజకుమారిలా మెరిసిపోయేందుకు ఈ గౌను వేయాల్సిందే! లేత ఆకుపచ్చ రంగు నెట్‌ని కుచ్చులు కుచ్చులుగా గౌను కుట్టారు. దాని మీద రిబ్బన్ వర్క్‌తో పువ్వులు కుట్టి హైలైట్ చేశారు. ఫ్లోర్ లెంగ్త్ ఉన్న ఈ గౌన్ పార్టీల్లో మిమ్మల్ని ప్రత్యేకంగా చూపిస్తుంది.

1051
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles