అక్కడ ఎక్కువసేపు వద్దు!


Mon,August 6, 2018 01:31 AM

ఉదయం లేవగానే పేపర్ పట్టుకొని టాయిలెట్లలో గడిపేవారి సంఖ్య ఎక్కువ. సిగరెట్లు తాగడానికి, స్మార్ట్‌ఫోన్లతో టైమ్‌పాస్ చేసేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఇలా ఎక్కువసేపు టాయిలెట్లలో ఉండకూడదంటున్నారు వైద్యులు.
toilet
స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత టాయిలెట్లలో ఎక్కువసేపు గడిపేవారి సంఖ్య క్రమేనా పెరుగుతున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. టాయిలెట్లలో పది నిమిషాలకు మించి ఎక్కువసేపు గడుపొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతకుమించి ఉంటే రోగాలబారిన పడిపోవడం ఖాయమంటున్నారు. ఎంత తక్కువసేపు టాయిలెట్లలో గడిపితే అంత మంచిదని చెబుతున్నారు. మీ ఫోన్‌తో టాయిలెట్లలో గడుపడం ఇంకా అస్సలు మంచిది కాదు. దీనివల్ల మీ ఫోన్‌కు 18 రెట్లు అధిక సూక్ష్మజీవులు అంటుకుంటాయి. ఎక్కువసేపు టాయిలెట్లలో కూర్చోవడం ద్వారా మూత్ర ద్వారం వద్ద రక్తనాళాలు కుంచించుకుపోయే ప్రమాదం ఉంది. మూత్ర ద్వారం వాపుతోపాటు ఇన్‌ఫెక్షన్‌కు గురై హెమోర్హొయిడ్స్ సమస్యలు ఏర్పడుతాయి. ఎక్కువసేపు టాయిలెట్లలో గడుపడం వల్ల విసర్జన సమస్యలు కూడా ఏర్పడుతాయి. కాబట్టి పది నిమిషాల్లోనే టాయిలెట్ల నుంచి బయటకు రావడం మంచిది అని వారు హెచ్చరిస్తున్నారు.

1448
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles