అందాల ఖైదీ సుందరి!


Thu,December 6, 2018 11:43 PM

అందాల పోటీలంటే ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది. ర్యాంప్‌పై హొయలొలికే సుందరీమణులు నిర్ణేతల, ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడతారు. అలాంటి పోటీలు ఎక్కడ నిర్వహించినా విశేష ఆదరణ లభిస్తుంది. అయితే.. జైళ్లలోని మహిళా ఖైదీలకు అందాల పోటీలు నిర్వహిస్తే ..?

Prison-Beauty
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో తలవెరా బ్రూస్ జైల్లో మహిళా ఖైదీలకు అందాల పోటీ నిర్వహించారు. మహిళా ఖైదీలకు గౌరవం పెంపొందించడంతో పాటు వారి కుటుంబ సభ్యుల్ని తిరిగి కలుసుకునే అవకాశం కల్పిస్తూ.. జైలులో అందాల పోటీలు నిర్వహించడం విశేషం. ఇలా 13 యేండ్ల నుంచి పోటీలు నిర్వహిస్తూనే ఉన్నారు. 2018 సంవత్సరానికిగాను వెరోనికా వెరోన్ అనే ఖైదీ విజేతగా నిలిచింది. 2017లో విజేతగా మయానా రోసో ఆలవ్స్ వెరోనికాకు కిరీటం తొడిగింది. పెరెన్నికగల అందాల పోటీల్లో మాదిరిగానే ఈ పోటీల్లో కూడా మహిళా ఖైదీలు అందంగా అలంకరించుకుంటారు. కాళ్లకు వేసుకొనే చెప్పుల నుంచి జుట్టుకు పెట్టుకునే క్లిప్పుల వరకూ అన్నీ ట్రెండీగానే ఉంటాయి. మహిళా ఖైదీల హక్కులు కాపాడటం, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, వారిలో నేర ప్రవృత్తిని తగ్గించడానికి ప్రతియేటా ఇలా పోటీలు నిర్వహిస్తున్నారు జైలు అధికారులు. ఈ పోటీల్లో భాగంగానే మహిళా ఖైదీలు తమవారిని కలుసుకొని, వారితో మనస్ఫూర్తిగా మాట్లాడుకునే అవకాశం కల్పిస్తారు. తమలోని బాధను, కుటుంబసభ్యుల్లోని భయాన్ని పోగొట్టేందుకు ఖైదీలు అందంగా ముస్తాబై పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. 2018 కిరీటధారి వెరోనికా వెరోన్ తనను విజేతగా ప్రకటించడంతో భావోద్వేగంతో మురిసిపోయింది.

911
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles