అందరూ ఇవే వాడాలి..


Thu,April 20, 2017 11:34 PM

ట్విట్టర్‌లో ఓ ట్రెండింగ్ నడుస్తున్నది. మహిళా లోకమంతా ఏకమై నినదిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తుస్తున్నది. ఏంటా డిమాండ్?
tax
క్యాన్సర్‌ను తరిమికొట్టాలంటే నాప్‌కిన్స్ ధరల మీదున్న ట్యాక్స్‌ను రద్దు చేయాలని.. ఫ్రీటాక్స్ నాప్‌కిన్స్ అందజేయాలనేదే వాళ్ల డిమాండ్. షీ సేస్ స్వచ్ఛందసంస్థ లాహు కా లగాన్ పేరుతో ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. సెలబ్రిటీలు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా అర్జున్‌కపూర్ చెల్లెలు అన్షులా దీనికి సంబంధించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. కేంద్రమంతి అరుణ్‌జైట్లీకి ట్వీట్ చేస్తూ జీఎస్టీ బిల్లులో దీన్ని చేర్చాలని డిమాండ్ చేసింది. భారతీయ మహిళల్లో 12 శాతం మంది మాత్రమే సానిటరీ నాప్‌కిన్స్ వాడుతున్నారని.. డబ్బున్న వాళ్లే కాదు.. ప్రతి ఒక్కరూ వీటిని వాడేందుకు ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందనేది ఈ కార్యక్రమ ఉద్దేశం.

680
Tags

More News

VIRAL NEWS