అందంతో అమ్మింది.. సెలబ్రిటీ అయింది!


Tue,July 31, 2018 11:25 PM

రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిన వాళ్లని చూస్తూనే ఉన్నాం. ఓ యువతి అందంతో మిఠాయిలు అమ్మి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. మిఠాయిలకు, అందానికి సంబంధం ఏంటి? ఇంతకి ఆ యువతి ఎలా పాపులర్ అయిందనుకుంటున్నారు?
celeb
కొరియాలో ఓ వ్యక్తి మిఠాయిల దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. గిరాకీ లేకపోవడం వల్ల వ్యాపారం నడువడం కష్టమయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాపారం పుంజుకోవడం లేదు. అప్పుతో వ్యాపారాన్ని నడపడం కష్టం అనిపించి ఆపేయాలనుకొన్నాడు. దుకాణం ఎవరికైనా అమ్మేయాలనుకున్నాడు. అంతలో ఒక ఉపాయం తట్టింది. ఎవరైనా అందమైన అమ్మాయితో మిఠాయిలు అమ్మిస్తే వ్యాపారం బాగా జరుగుతుందని అనుకున్నాడు. ఆలోచన రాగానే ఆలస్యం చేయకుండా అందమైన అమ్మాయిని ఉద్యోగంలో పెట్టి మిఠాయిలు అమ్మించడం మొదలుపెట్టాడు. గిరాకీ పెరిగింది. మిఠాయిలు కొనడం ఏంటో కానీ ఆ యువతిని చూసేందుకు జనాలు షాప్ ముందు లైన్ కట్టడం మొదలుపెట్టారు. కుర్రకారు అయితే మిఠాయిల సాకుతో ఆమెను చూడడానికి స్వీట్ షాపునకు రావడం మొదలుపెట్టారు. ఇంకేముంటుంది? మూసేయాలనుకున్న షాప్ బాగా నడుస్తుంది. మిఠాయిలకు, మిఠాయి షాపులో ఉన్న అమ్మాయికి అభిమానులు పెరిగిపోయారు. అంతేకాదు ఇప్పుడా అమ్మాయికి సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. ఎందుకు రాత్రి రాత్రే స్టార్ అయిందో ఆమెకు కూడా ఇప్పటికీ అర్థం కావడం లేదు. కొన్ని కొన్ని అంతే మనకు తెలియకుండానే అద్భుతాలు జరిగిపోతుంటాయి.

943
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles