లింఫోమా అంటే..?


Mon,October 15, 2018 01:28 AM

నా వయసు 48 సంవత్సరాలు. కొద్ది రోజులుగా ప్లేహం పెరుగడం, పొట్టలో నొప్పి, గజ్జల్లో వాపు, జ్వరం, చలి, రాత్రి పూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం లక్షణాలతో బాధపడుతున్నాను. ఈ లక్షణాలతో డాక్టరు గారిని కలిస్తే ఆయన కొన్ని పరీక్షలు నిర్వహించి మీరు లింఫోమాతో బాధపడుతున్నారని నిర్ధారించారు. దయచేసి లింఫోమా అంటే ఏమిటి? దీని చికిత్స మార్గాలు తెలుపగలరు?
- వాణి, హన్మకొండ

councelling
లింఫోమా అనేది లింఫోసైట్‌లను (తెల్ల రక్తకణాలు) ఉత్పత్తి చేసే, నిల్వ చేసే, తీసుకెళ్లే కణజాలల్లో కలిగే క్యాన్సర్. లింఫోమా రెండు రకాలు.. హడ్జ్‌కిన్స్ లింఫోమా, నాన్ హడ్జ్‌కిన్స్ లింఫోమా. దీని లక్షణాలు.. నొప్పి లేకుండా మెడలో, చంకలో, గజ్జల్లో వాపు వస్తుంది. ప్లేహం పెరుగడం వల్ల పొట్ట నొప్పి వస్తుంది. జ్వరం, చలి, రాత్రిళ్లు చెమటలు పట్టడం, శక్తి లేకపోవడం, బరువు తగ్గడంతో పాటు దురద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు మీలో ఉన్నాయని రాశారు. కాబట్టి రక్త పరీక్ష, బయాప్సీ, ఎముక మూలగ పరీక్ష, సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, మాలిక్యులర్ పరీక్షల ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. సీటీస్కాన్, ఎంఆర్, పీఈటీ స్కాన్‌లతో ఇమేజింగ్ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలను క్షుణ్ణంగా డాక్టర్లు పరిశీలించి, పరిశోధించి లింఫోమా వ్యాప్తి మీలో ఏ మేరకు ఉందో తెలుపుతారు. మీకు ఏ రకమైన లింఫోమా ఉంది? లింఫోమా వల్ల శరీరంలోని ఏ ప్రాంతాలు దెబ్బతిన్నాయన్నది గుర్తిస్తారు. మీ రిపోర్ట్‌లో క్యాన్సరు పెరుగుతుందని చూసిప్తే దానికి తగ్గట్టుగా చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.

వీటితో పాటు.. ఒకేసారి ఎక్కువ భోజనం చేయకుండా కొద్దికొద్దిగా తినాలి. మసాలా ఆహారాలు, బత్తాయి రసం తాగకండి. రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి. స్ట్రెచ్చింగ్, వాకింగ్‌లాంటివి చేయాలి. అవి కూడా డాక్టరు సలహా మేరకే చేయాల్సి ఉంటుంది. తగినంత విశ్రాంతి అవసరం. ఇవి చేస్తూ.. చికిత్స అయిన తర్వాత కూడా కొన్ని టేస్ట్‌లు చేయించుకోండి. క్లినికల్ రొమ్ము పరీక్ష, మమ్మోగ్రఫి, పాప్, కోలోరెక్టల్ స్క్రీనింగ్‌లు, ప్రొస్టేట్ పరీక్షలు, ఎముక సాంద్రత స్కాన్‌లు చేయించుకుంటే మంచిది.

1249
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles