డబ్బావాలాల యాప్!


Tue,August 7, 2018 11:17 PM

ముంబై డబ్బావాలాల గురించి ఇండియాలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి ఐడియా, పనితనంతో అంతలా పాపులర్ అయ్యారు వారు. అయితే.. వారికోసం 13ఏళ్ల కుర్రాడు యాప్ తయారుచేశాడు. దాని గురించే ఇప్పుడు చెప్పుకుందాం.
dabbawala
ఆఫీసుకే నేరుగా లంచ్‌బాక్స్ తెచ్చి ఇచ్చే ఐడియాతో మొదైలంది డబ్బావాలా సర్వీస్. ఈ ఐడియా బాగుండడంతో చాలా తక్కువ సమయంలోనే క్లిక్ అయింది కూడా. ఇప్పుడు పరిచయం అవసరం లేనంతగా పాపులర్ అయింది. దాదాపు 200 మందికి ఉపాధి కల్పించిన డబ్బావాలా ముంబైలో రోజుకు 1200 డెలివరీలు చేస్తుంది. 13 సంవత్సరాల తిలక్ వాళ్ల అంకుల్ కూడా డబ్బావాలా వ్యాపారంలో ఒక భాగం. ఒకరోజు దూరంగా ఉన్న కొన్ని ఆర్డర్స్ మిస్ అయినట్టు వాళ్లు మాట్లాడుకుంటుండగా తిలక్ విన్నాడు. వెంటనే ఆ రోజంతా ఆలోచించి పేపర్స్ అండ్ పార్శల్స్ పేరుతో ఒక ఐడియాకు రూపమిచ్చాడు. అదే డబ్బావాలా యాప్. వారం తర్వాత దాన్ని బెటా టెస్ట్‌కి చేశారు. ఆ తర్వాత లాజిస్టిక్ ఆఫీస్ వాళ్లతో మాట్లాడి నెట్‌వర్క్ విస్తరించుకున్నారు. పార్శిల్ చేయాల్సిన బరువును బట్టి ధర నిర్ణయించారు. ఇప్పుడు ఈ యాప్ ద్వారా రాబోయే రెండేండ్లలో వందకోట్ల టర్నోవర్ సాధించాలని ఆలోచిస్తున్నాడు కంపనీ సీఈవో ఘన్‌శ్యామ్ పరేఖ్. ఫోన్ కాల్ ద్వారా, ముందురోజు అయిన బుకింగ్ ఆర్డర్లను డెలివరీ ఇచ్చే డబ్బావాలాలు ఇప్పుడు తిలక్ రూపొందించిన యాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నారు. డెలివరీ చేస్తున్నారు.

642
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles