ప్రాణం తీసిన టిక్‌టాక్ సరదా


Fri,July 12, 2019 02:35 AM

youth-drowned-in-pond-while-taking-tiktok-vedio

చెరువులో మునిగి యువకుడు మృతి
పేట్‌బషీరాబాద్: టిక్‌టాక్ సెల్ఫీవిడియో సరదా యువకుడి ప్రాణాలు బలితీసుకుంది. హైదరాబాద్ నగరశివారులో ఒక యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై సీఐ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన బేగరి శరణయ్య కుమారుడు నర్సింహులు (24) ఈ నెల 8న గండిమైసమ్మ దుండిగల్ మండల పరిధిలోని దూలపల్లిలో ఉంటూ సూరారంలో పనిచేస్తున్న సోదరుడు ప్రశాంత్ ఇంటికి వచ్చాడు. మంగళవారం (ఈ నెల 9న) సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఇద్దరూ కలిసి దూలపల్లిలోని తుమార్‌చెరువుకు స్నానానికి వెళ్లారు.

swimming2
నర్సింహులుకు టిక్‌టాక్ ఆలోచన రాగా.. ప్రశాంత్ తన ఫోన్ ద్వారా సెల్ఫీవీడియో తీయడం ప్రారంభించాడు. టిక్‌టాక్‌లో వస్తున్న పాటకు అనుగుణంగా సరదాగా నీటిలో ఎగురుతున్న నర్సింహులు ఈతరాక నీటిలో మునిగిపోయాడు. ప్రశాంత్ దూలపల్లిలోని బంధువులను పిలిపించి వెతికినా ప్రయోజనం లేకపోవడంతో తెల్లారాక గజ ఈతగాళ్లు వెతికి నర్సింహులు మృతదేహాన్ని బయటికి తీశారు. టిక్‌టాక్, తదితర సోషల్‌మీడియాల్లో సెల్ఫీ వీడియోలు, చిత్రాలు అప్‌లోడ్ చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని పేట్‌బషీరాబాద్ సీఐ మహేశ్ అన్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లలను అప్రమత్తం చేయాలని కోరారు.

715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles