ప్రేమజంట ఆత్మహత్య


Thu,September 12, 2019 02:32 AM

Young lovers commit suicide in Rangareddy district

కొందుర్గు : ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా జిల్లెడుచౌదరిగూడ పరిధిలో చోటుచేసుకున్నది. మండలంలోని రావిర్యాలకు చెందిన మైసగళ్ల మల్లేశ్ (21), నాగమోళ్ల కృష్ణవేణి (17) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం అమ్మాయివాళ్ల ఇంట్లో తెలవడంతో వారు పెండ్లికి నిరాకరించారు. కాగా, కృష్ణవేణి కనిపించడం లేదని, గ్రామానికి చెందిన మల్లేశ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని ఆమె పెద్దమ్మ నాగమోళ్ల పద్మమ్మ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈక్రమంలో పెద్దఎల్కిచర్ల అడవిలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని విచారించగా మృతదేహాలు మల్లేశ్, కృష్ణవేణి అని తేలింది. మృతదేహాలను షాద్‌నగర్ దవాఖానకు తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.

714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles