అనన్యం.. అసమానం


Sun,June 16, 2019 02:54 AM

Yadadri Temple Premiere work completed 92 percent

- శోభాయమానంగా పంచనారసింహక్షేత్రం
- ఆధ్యాత్మిక రాజధానిగా ఆవిష్కారమవుతున్న యాదాద్రి
- ప్రధానాలయం పనులు 92 శాతం పూర్తి: వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు


యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణపనులు వేగంగా పూర్తవుతున్నాయి. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో సాగుతున్న పనులు అబ్బురపరుస్తున్నాయి. ఆరు మహారాజ గోపురాలు, విమాన గోపురం, ప్రాకారాలు, వేం చేపు మండపాలు సుందరంగా రూపొందుతున్నాయి. ఆధారశిల నుంచి మహానాసి వరకు సంపూర్ణంగా కృష్ణశిలలతో నిర్మాణమైన గోపురాలు.. గర్భగుడిపై దివ్య విమానం ఇప్పటికే ఆవిష్కృతమయ్యాయి. మొదటి ప్రాకారంలో తూర్పువైపున త్రితల రాజగోపురం(ప్రవేశ మార్గం), పడమర దిశలో ఐదంతస్తుల గోపురం(బయటకు వెళ్లేందుకు), రెండో ప్రాకారానికి పశ్చిమాన ఏడంతస్థుల మహారాజగోపురం, తూర్పు, ఉత్తర, దక్షిణ దిశల్లో ఐదంతస్తుల రాజగోపురాలు సిద్ధమయ్యాయి. గర్భాలయంపై 42 అడుగుల దివ్య విమానం (విమాన గోపురం) పూర్తవడంతో గోపుర నిర్మాణ క్రతువు పూర్తయిందని ప్రధాన స్థపతులు సుందరరాజన్ అనందచారి వేలు తెలిపారు.
Yadadri-Temple1
విమాన గోపురాన్ని స్వర్ణమయం చేసి దానిపైన సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠించనున్నారు. మరోవైపు 28 అష్టభుజి మండపాలపై 28 విమానాలను నిర్మించారు. స్తంభాలపైన సిం హాలు, హంసలు, ఏనుగులు, లతలు, వివిధ రకాల మృగాలు, నారసింహుడి అవతరాలను శిల్పులు చెక్కారు. బాహ్యప్రాకారం, అష్టభుజి మండపాలు, స్తంభాలు, వాటిలో ఒదిగిపోయిన బాలపాద స్తంభాలు, అడుగున గజమూర్తులు స్తంభాన్ని మోస్తూ కనువిందుచేస్తున్నాయి. ప్రాచీన శిల్పకళా వైచిత్రితో యాదాద్రి దేశంలోనే అద్భుతమైన ఆలయంగా ఆవిష్కారమవుతున్నది. కీలకమైన ప్రధానాలయం పనులు 92 శాతం పూర్తయ్యాయని, సివిల్ పనులను మరింత వేగంచేస్తామని వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు తెలిపారు.
Yadadri-Temple2

షెడ్యూలు ప్రకారం పూర్తి: సీఎంవో కార్యదర్శి

యాదాద్రి ఆలయ నిర్మాణం పనులను మరింతవేగవంతంగా నిర్వహించి అనుకున్న షెడ్యూలు ప్రకారం పనులు పూర్తి చేయాలని సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం కొండపై జరుగుతున్న పనులను ఆయన వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు, యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, ఆలయ ఈవో ఎన్ గీత, స్థపతులు, ఇంజినీర్లతో కలిసి పరిశీలించారు. అనంతరం హోటల్ హరితలో అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles