సమగ్ర 'గోల్డ్ పాలసీ'ని తీసుకురావాలి


Mon,January 30, 2017 01:18 AM

Y V Reddy pitches for comprehensive gold policy

-రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ వైవీరెడ్డి

Gold-policy
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతంచేసే విధంగా కేంద్ర ప్రభుత్వం సమగ్రమైన గోల్డ్ పాలసీని తీసుకురావాలని ఆర్బీ మాజీ గవర్నర్ వైవీరెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన గోల్డ్ బ్లాక్, వైట్ అండ్ ఎల్లో అనే అంశంపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఓ బంగారం పథకాన్ని ప్రవేశపెట్టడం, రూ.2 లక్షలకు పైబడిన బంగారం కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి చేయడం బంగారం ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నదని అన్నారు.

ముగిసిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్


సాహితీ సంభాషణలు, సాంస్కృతిక కళా ప్రదర్శనలతో మూడు రోజులపాటు సందడిగా సాగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఆదివారం ముగిసింది. ప్రముఖ సాహితీవేత్త, కవి అశోక్ వాజపేయి, రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించిన 7వ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో ఆసక్తికరమైన సాహిత్య చర్చలు జరిగాయి. మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరీ, ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి, పద్మశ్రీ సునీతా కృష్ణన్ లాంటి ప్రముఖులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రకాశ్‌రాజ్, నందినీరెడ్డి వంటి సినీ ప్రముఖులు సైతం లిటరరీ ఫెస్టివల్‌లో సందడి చేశారు.

1117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles