పొగమంచుతో పలురైళ్ల్లు రద్దు


Wed,December 30, 2015 01:21 AM

With fog canceled several trains

మెట్టుగూడ: ఉత్తర భారతదేశంలో పొగమంచు కారణంగా జనవరి ఎనిమిది నుంచి ఫిబ్రవరి 29 తేదీల మధ్య పలు రైళ్లు రద్దుచేస్తున్నట్లు సీఎస్సార్ సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ మంగళశారం ఓ ప్రకటనలో తెలిపారు. రైలు నంబర్ 12791 సికింద్రాబాద్-దానాపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనవరి 10, 14, 17, 21, 24, 31, ఫిబ్రవరి 4, 7, 11, 14, 18, 21, 25 తేదీల్లో ఉండదు. రైలు నంబర్ 12792 దానాపూర్-సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనవరి 12, 16, 19, 23, 26, 30, ఫిబ్రవరి 2, 6, 9, 13, 16, 20, 23, 27 తేదీల్లో రద్దు. రైలు నంబర్ 12723 హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనవరి 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో ఉండదు. రైలు నంబర్ 12724 న్యూఢిల్లీ- హైదరాబాద్ తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనవరి 14, 21, 28 ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో రద్దు. రైలు నంబర్ 12721 హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనవరి 11, 18, 25 ఫిబ్రవరి1, 8, 15, 22 తేదీల్లో ఉండదు. రైలు నంబర్ 12722 హజ్రత్ నిజాముద్దీన్ -హైదరాబాద్ దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనవరి 13, 20, 27 ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో రద్దు.

783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS