మహిళా ప్రయాణికులకు మరింత భద్రత

Tue,October 8, 2019 03:03 AM

పోలీస్ యాప్‌లతో క్యాబ్‌ల అనుసంధానం: డీజీపీ మహేందర్‌రెడ్డి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో, రాష్ట్ర వ్యాప్తంగా క్యాబ్‌లలో ప్రయాణించే.. ప్రత్యేకించి మహిళల భద్రత కోసం రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కొత్త యాప్‌ను విడుదలచేశారు. పోలీస్ యాప్‌లు, పోలీస్ స్టేషన్లతో క్యాబ్‌లను అనుసంధానించేలా ఈ యాప్‌ను రూపొందించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మహిళలపై నేరాలను నియంత్రించేందుకు.. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ పరిశ్రమల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు క్యాబ్‌లలో ప్రయాణిస్తున్నప్పుడు వారికి భద్రత కల్పించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని డీజీపీ తెలిపారు. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఆపద ఎదురైనప్పుడు క్యాబ్ సర్వీస్ యాప్‌లోని ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కగానే ఆ సందేశం పోలీసు హాక్ ఐ యాప్‌కు వెళ్లిపోతుంది.


ఆ వెంటనే క్యాబ్ లొకేషన్, ప్యాసింజర్ వివరాలు పోలీస్ కంట్రోల్ రూంకు, సమీప పెట్రోలింగ్ వాహనం, సంబంధిత పోలీస్ స్టేషన్, డివిజనల్ ఏసీపీ, జోనల్ డీసీపీతోపాటు క్యాబ్ ఆపరేటర్ కంట్రోల్ రూంకు, రిజిస్టర్డ్ కుటుంబసభ్యులు, స్నేహితులకు కూడా వెళ్తాయి. సమాచారం అందగానే సదరు వాహనాన్ని ట్రాక్ చేస్తూ పోలీసు బలగాలు నిర్దిష్ట ప్రాంతానికి చేరుకొంటాయి. ఈ మేరకు వివిధ క్యాబ్ ఆపరేటర్లతో పోలీసు శాఖ ఒప్పందాలు చేసుకున్నదని డీజీపీ వివరించారు. దీంతో నేరం జరుగకముందే దాన్ని నిరోధించేందుకు వీలవుతుందని డీజీపీ తెలిపారు.

445
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles