22 నుంచి జంతుగణన


Sat,January 20, 2018 12:42 AM

Wild animals in telangana

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అటవీ జంతువులను లెక్కించబోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 22 నుంచి 29 వరకు పులులు, జంతుగణన చేపట్టి.. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ చర్యలు చేపడుతుంది. శుక్రవారం సచివాలయం నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి.. జిల్లాలవారీగా జంతుగణన ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశంలో పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్) డాక్టర్ మనోరంజన్ భాంజా, ప్రత్యేకాధికారి శంకరణ్, పీసీసీఎఫ్ పీకే ఝా, అధికారులు పృథ్వీరాజ్, లోకేశ్ జైస్వాల్, డోబ్రియల్, సునీల్‌కుమార్‌గుప్తా, తిరుపతయ్య పాల్గొన్నారు.

204

More News

VIRAL NEWS