ప్రచారం ముగిసింది


Thu,December 6, 2018 03:38 AM

Wide tours are the TRS candidates with road shows

-చివరిరోజూ గ్రామాల్లో జోరుగా ప్రచారాలు
-విస్తృత పర్యటనలు, రోడ్‌షోలతో హోరెత్తించిన గులాబీ అభ్యర్థులు
-అభివృద్ధి పథకాలతో గెలుపే లక్ష్యంగా ప్రజల ముందుకు..

నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్: ఎన్నికల రణరంగంలో మరో అంకం ముగిసింది. ప్రచార పర్వానికి బుధవారం సాయంత్రంతో బ్రేక్ పడింది. మైకులు, లౌడ్‌స్పీకర్లు సైలెన్స్‌ప్లీజ్ అంటూ మూగనోము పట్టాయి. రెండు నెలలుగా అభ్యర్థుల ప్రచారాలతో హోరెత్తిన పల్లె లు, పట్టణాలు నిశ్శబ్దాన్ని సంతరించుకున్నాయి. చివరిరోజు కూడా అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. రోడ్‌షోలు, విస్తృత పర్యటనలతో నాలుగున్నరేండ్ల కాలంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని తెలిపారు. నియోజకవర్గాల అభివృద్ధికి హామీలు ఇస్తూ.. కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తూ సాయంత్రం ఐదు గంటలలోపు ప్రచారానికి ముగింపు పలికారు.

ఇంటిస్థలమున్న అర్హులకు రూ. 5 లక్షలు..

టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటిస్థలమున్న అర్హులకు డబుల్ బెడ్‌రూం నిర్మాణం కోసం రూ. ఐదు లక్షలు మంజూరు చేస్తామని ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆల వెం కటేశ్వర్‌రెడ్డితో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. ప్రజాకూటమి పేరుతో ముందుకు వస్తున్న నాయకుల మాటలు నమ్మవద్దని ప్ర జలకు సూచించారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీకి ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. మహబూబ్‌నగర్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ హన్వాడ, సల్లోనిపల్లిలో ప్రచారం చేశారు. మక్తల్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఊట్కూర్ మండలంలో, నారాయణపేట అభ్యర్థి రాజేందర్‌రెడ్డి దామరగిద్ద రోడ్‌షోల్లో పాల్గొన్నారు. వనపర్తి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి భారీ రోడ్‌షో నిర్వహించారు. 15వేల మందితో పట్టణంలో జరిగిన ఈ ర్యాలీలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ ఎల్లప్పుడు ప్రజా సంక్షేమం కోసమే పనిచేశానన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ అభ్యర్థి హన్మంత్‌షిండే పిట్లం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Pracharam

నల్లగొండలో..

నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ టీఆర్‌ఎస్ శ్రేణులు జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. మిర్యాలగూడ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు పట్టణంలోని పలు కాలనీల్లో, సాగర్ అభ్యర్థి నోముల నర్సింహయ్య ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో కలిసి అనుముల, నిడమనూరు మండలాల్లో, దేవరకొండ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ పట్టణంలో, వేముల వీరేశం మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి నకిరేకల్‌లో ప్రచారం చేశారు. కేతేపల్లి మండలం భీమారంలో ఎంపీ లింగయ్యయాదవ్, చిట్యాలలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ ము నుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చండూరు, మర్రిగూడ మండలాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టి రోడ్‌షోలు నిర్వహించారు. పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు తొర్రూర్‌లో రో డ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర భుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, విజయం తమదేనని ధీమా వ్యక్తంచేశారు.

లగడపాటి.. తెలంగాణ ద్రోహి: ఎంపీ సీతారాంనాయక్

లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ద్రోహి అని, అతడి బూటకపు సర్వేలు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. నెల్లికుదురులో మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధే ఎజెండాగా సాగిన టీఆర్‌ఎస్ ఎన్నికల్లో వందకుపైగా స్థానాలు దక్కించుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. గతంలో సర్వే నిర్వహించి 75కు పైగా స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పిన లగడపాటి.. ఇప్పుడు చంద్రబాబుతో కుమ్మక్కై బూటకపు సర్వే వివరాలు వెల్లడించటం విడ్డూరంగా ఉన్నదన్నారు. దేశవ్యాప్తంగా మన్ననలు పొందిన సీఎం కేసీఆర్ మళ్లీ గెలువాలంటూ అన్నవరం సన్నిధిలో అక్కడి ప్రజ లు పూజలు చేస్తున్నారని తెలిపారు. మానుకోట అభ్యర్థి శంకర్‌నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
TRS

బాబును ఆంధ్రాకు తరిమికొట్టాలి: మంత్రి జోగు
ఆదిలాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని తెలంగాణలో కుట్రలకు పాల్పడుతున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని ప్రజలు ఆంధ్రాకు తరిమికొట్టాలని ఆదిలాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. బుధవారం బేల మండలం అవ్వాల్‌పూర్, సిర్సన్న, ఆదిలాబాద్ పట్టణంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్షాల నాయకులు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీకి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
Dhayakar-rao

ఆధిపత్యానికి బాబు కుట్రలు: ఎంపీ గుత్తా

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నాడు తె లంగాణ ఏర్పాటుకు, నేడు రాష్ర్టాభివృద్ధికి అడ్డుపడుతు న్న చంద్రబాబు.. కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని ఆధిప త్యం కోసం కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. బుధవా రం నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ద్రోహి, బుడ్డర్‌ఖాన్ లగడపాటి రాజగోపాల్ ఆడామగా కాని సర్వేలతో చంద్రబాబుతో కలిసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని వార్తాపత్రికలు, టీవీచానెళ్లను గంపగుత్తగా కొనుగోలు చేసి కూటమికి అనుకూల ప్రకటనలు ఇప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం అభ్యర్థులుగా, సీనియర్ నేతలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలందరూ ఓడిపోవడం ఖాయమన్నారు. తెలంగాణ భవిష్యత్‌ను ఆంధ్రా చేతుల్లో పెట్టిన కాంగ్రెస్‌ను.. చంద్రబాబు తిరిగిన స్థానాల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్‌వలీ తదితరులు పాల్గొన్నారు.

ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం : మంత్రి పోచారం

బాన్సువాడ రూరల్: టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో వ్యవసా య రుణాలు మాఫీ చేస్తామని బాన్సువాడ టీఆర్‌ఎ స్ అభ్యర్థి, మంత్రి పోచా రం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మం డలంలోని బుడిమి, తాడ్కో ల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రం అమలుచేయని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలుచేశామని చెప్పారు. నిరుపేదల సొంతింటికల సాకారమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సుపరిపాలన అందించారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి బీడుభూములను సస్యశ్యామలం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వందసీట్లు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా ఏర్పడ్డ ప్రజాకూటమి అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

కూటమిని నమ్మొద్దు : మంత్రి లకా్ష్మరెడ్డి

జడ్చర్ల టౌన్: మహాకూటమిని నమ్మొద్దని, ఆ పార్టీలకు ఓటేస్తే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నట్టేనని, జడ్చర్ల అభ్యర్థి, మంత్రి లకా్ష్మరెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిలోని నేతాజీచౌక్‌లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ.. కూటమి పార్టీలు తెలంగాణను ఆగంచేయడానికి పూనుకున్నాయన్నారు. ఇక్కడి ప్రాజెక్టులను ఆపాలనే కుట్రతో చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టారని మండిపడ్డారు. నాలుగున్నరేండ్లుగా ప్రజలు టీఆర్‌ఎస్ ప్రభుత్వపాలన ఎలా ఉన్నదో చూశారని, వారంతా టీఆర్‌ఎస్‌నే మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తంచేశారు.

1385
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles