హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వీరజవాన్ల కుటుంబాలకు, మాజీ సైనికులకు అండగా ఉంటామని దక్షిణ భారత్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్, లెఫ్టినెంట్ జనరల్ ఎస్టీ ఉపాసని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అం దుతున్న పథకాలు, ఇతర సదుపాయాలు, వారి సమస్యల పరిష్కారానికి శుక్రవారం సికింద్రాబాద్ ఏవోసీ సెంటర్లో మాజీ సైనికుల ర్యాలీ నిర్వహించారు. మాజీ సైనికుల చిరునామా, ఇతర వివరాల్లో తప్పులను సరిచేయడంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి ర్యాలీ ఉపయోగపడిందని చెప్పారు. వీరజవాన్ల భార్యలను, చదువులో ప్రతిభ చూపిన సైనికుల పిల్లలను రిటైర్డ్ మేజర్ జనరల్ కృష్ణన్ సత్కరించారు.