బీసీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం


Sat,September 14, 2019 01:59 AM

We are committed to BC welfare says minister gangula kamalakar

- యువత ఉపాధి కల్పనకు ప్రత్యేక చర్యలు: మంత్రి గంగుల

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. బీసీ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్టు తెలిపారు. శుక్రవారం సంక్షేమ భవన్లో బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీ నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూత పథకం ద్వారా లబ్ధిచేకూరేలా కృషిచేస్తామని, అలాగే స్వయం ఉపాధికి వంద శాతం సబ్సిడీ పథకం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషిచేస్తామని చెప్పారు.

బీసీ కమిషన్ ఆఫీస్‌కు మంత్రి గంగుల

మంత్రి గంగుల శుక్రవారం రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయాన్ని సందర్శించి వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనను బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యుడు ఆంజనేయగౌడ్ సత్కరించారు.

50
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles